ఈనెల 11 నుండి చినవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-05T14:16:34+05:30 IST

ద్వారకాతిరుమల చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ప్రారంభంకానున్నాయి.

ఈనెల 11 నుండి చినవెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ఏలూరు: ద్వారకాతిరుమల చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ప్రారంభంకానున్నాయి. 11 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 15 న స్వామి వారి తీరు కల్యాణ మహోత్సవం, 16 న స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య ఆర్జిత కళ్యాణాలు, సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 

Read more