
ఏలూరు టూ టౌన్, మే 16: ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్గా షేక్ షాహీద్బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు. షాహీద్ 2011లో గ్రూప్–1 అధికారిగా నియమితులయ్యారు. అప్పటినుంచి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేశారు. షాహీద్ను ఈ నెల 9న ఏలూరు నగర కమిషనర్గా బదిలీ చేసింది.