ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-25T13:40:52+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని సీఆర్‌

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు షురూ చేశారు. మధ్యాహ్నానికి కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. నాలుగున్నర నెలల ఉత్కంఠకు ఇవాళ్టి మధ్యాహ్నంతో తెరపడనుంది. కళాశాలలో నాలుగు హాల్స్‌ ఏర్పాటు చేసి వీటిలో 47 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒకొక్క టేబుల్‌లో ఒక్కొ డివిజన్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం 64 మంది సూపర్‌ వైజర్లను, కౌంటింగ్‌ అసిస్టెంట్లను 250 మందిని ఏర్పాటు చేశారు. వీరుగాక 500 మంది మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్‌ హాల్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ప్రారంభం అయిన దగ్గర నుంచి విజేతలను ప్రకటించే వరకు వీడియో కెమెరా ద్వారా పరిశీలిస్తారు. కాగా.. నగరంలోని 50 డివిజన్లకు మూడు ఏకగ్రీవమవడంతో మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరిగిన విషయం విదితమే.

Updated Date - 2021-07-25T13:40:52+05:30 IST