Bus accident: ఏలూరులో స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-07T16:21:41+05:30 IST

జిల్లాలోని జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం వద్ద స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Bus accident: ఏలూరులో స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం

ఏలూరు: జిల్లాలోని జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం వద్ద స్కూల్ బస్సు(school bus) కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న స్కూల్ బస్‌ను వెనుక నుంచి మరో స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పిల్లలను తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బస్ డ్రైవర్‌పై ఆగ్రహంతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెంకు చెందిన సెంట్ జోసెఫ్ స్కూల్ బస్‌ను జంగారెడ్డిగూడెంకు చెందిన మరో స్కూల్ బస్ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-09-07T16:21:41+05:30 IST