ఉక్రెయిన్‌లో పాస్‌పోర్టులు లేని భారతీయులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-03-01T02:29:40+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి, వివిధ కారణాలతో పాస్‌పోర్టు లేకపోయిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

ఉక్రెయిన్‌లో పాస్‌పోర్టులు లేని భారతీయులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి, వివిధ కారణాలతో పాస్‌పోర్టు లేకపోయిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని భారత్‌కు తరలించడంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీతో జరిగిన సమావేశంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ పరిస్థితిపై దాదాపు 90 నిమిషాలపాటు చర్చించారు.  

 

ఈ సంద్భరంగా అక్కడి భారతీయ విద్యార్థుల ఇక్కట్లను స్టాండింగ్ కమిటీ ప్రస్తావించింది. భయంతో ఉక్రెయిన్‌ను విడిచిపెడుతున్న భారతీయ విద్యార్థుల వద్ద పాస్‌పోర్టులు కూడా లేవన్న విషయాన్ని చౌదరి లేవనెత్తారు. దీంతో స్పందించిన ష్రింగ్లా.. పాస్‌పోర్టులు లేని వారు భయపడాల్సిన అవసరం లేదని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విదేశాంగ శాఖ అధికారులు పాస్‌పోర్టులు లేని భారతీయలకు అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 5 విమానాల్లో 1200 మంది విద్యార్థులను తరలించినట్టు చెప్పారు.  

Updated Date - 2022-03-01T02:29:40+05:30 IST