ఎదిగే పార్టీ బీజేపీ.. కరిగే పార్టీ టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-03-09T04:48:13+05:30 IST

రాష్ట్రంలో ఎదిగే పార్టీ బీజేపీ, అని కరిగే పార్టీ టీఆర్‌ఎస్‌ అని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు.

ఎదిగే పార్టీ బీజేపీ.. కరిగే పార్టీ టీఆర్‌ఎస్‌
సమావేశంలో మాట్లాడుతున్న మురళీధర్‌రావు

బీజేపీ జాతీయ మాజీ  ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు 

వనపర్తి అర్బన్‌, మార్చి 8: రాష్ట్రంలో ఎదిగే పార్టీ బీజేపీ, అని కరిగే పార్టీ టీఆర్‌ఎస్‌ అని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు. సోమవారం పట్టణంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి గెలుపు ఓటములు లెక్క కాదని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పార్టీ అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరున్నర ఏళ్లు అయిన నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. యూనివర్సిటీలలో ఖాళీలు ఉన్న ఎందుకు వాటిని భర్తీ చేయలేదని ప్రశ్నించారు.   దుబ్బాక లాగా ఒక్కసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తే పత్తా లేకుండా పోతారని అన్నారు. కాంగ్రెస్‌ మునిగిపోయే పడవలాంటి దని వారికి ఓటు వేసి గెలిపించినా చేసేది ఏమీ ఉండదన్నారు. ఎంత లేపినా ఆ పార్టీ లెవలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్ర త్యామ్నాయ పార్టీ బీజేపీనేనని, బీజే పీ పేరు వింటేనే టీఆర్‌ఎస్‌ నాయ కులు వణికిపోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క రోజైన కేసీఆర్‌ బ యటికి వచ్చి పట్టభద్రులను  ఓటువేయమని అడుగుతున్నారా అని అ న్నారు. ఈ ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావును ఆదరిస్తే ఫామ్‌ హౌస్‌ వదిలి కేసీఆర్‌ బయటికి వస్తారని అన్నారు.  సమా వేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్ని కల ఇన్‌చార్జి శ్రీవర్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజవర్దన్‌రెడడ్డి, మాజీ అధ్యక్షు డు అయ్యగారిప్రభాకర్‌రెడ్డి, నాయకులు కృష్ణ,, సబిరెడ్డివెంకట్‌రెడ్డి, శ్రీశైలం, మున్నూరు రవీందర్‌, నారాయణ, రామన్‌గౌడ్‌, సీతారాములు, పెద్దిరాజు, రామ్మోహన్‌, సూగూరు రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T04:48:13+05:30 IST