‘పది’లో సత్తాచాటిన ఆణిముత్యాలు

ABN , First Publish Date - 2022-07-01T06:13:41+05:30 IST

‘పది’లో సత్తాచాటిన ఆణిముత్యాలు

‘పది’లో సత్తాచాటిన ఆణిముత్యాలు

  • ప్రభుత్వ పాఠశాలల విజయకేతనం 
  • ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు 
  • ఉత్తమ ఫలితాల్లో బాలికలదే హవా


ఆమనగల్లు/కడ్తాల్‌/మాడ్గుల, జూన్‌ 30: పదోతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. పలు పాఠశాలల విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి జిల్లాస్థాయిలో రికార్డు సృష్టించారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి చాలాచోట్ల నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఆమనగల్లులోని 14ఉన్నత పాఠశాలల్లో 627మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 599మంది ఉత్తీర్ణులయ్యారు. మండలంలో 95.53శాతం ఉత్తీర్ణత సాధించారు. లిటీల్‌ స్కాలర్‌, ఆరబిందో, బ్రిలియంట్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణులయ్యారు. ఆమనగల్లు కృష్ణవేణి స్కూల్‌ విద్యార్థిని ఏ.శివాని, రిషిటాలెంట్‌ స్కూల్‌ విద్యార్థిని జి.శ్రీతి 10జీపీఏ సాధించింది. కడ్తాల మండలంలో 8 ఉన్నత పాఠశాలల్లో 388మంది విద్యార్థులకు గానూ 375 మంది ఉత్తీర్ణులయ్యారు. మండలంలో 97.16శాతం ఉత్తీర్ణత సాధించారు. కడ్తాల బాలికల ఉన్నత పాఠశాల, ఎక్వాయిపల్లి ఉన్నత పాఠశాల, కడ్తాల కేజీబీవీలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా, చరికొండ ఉన్నత పాఠశాల విద్యార్థిని అఖిల, మైసిగండి టీడబ్య్లూఏఎస్‌ విద్యార్థి పవన్‌, కడ్తాల కేజీబీవీకి చెందిన అనూష 10జీపీఏ సాధించారు. కడ్తాల మండల కేంద్రంలోని ప్రగతిఉన్నత పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 9మంది విద్యార్థులు 10జీపీఏ సాధించినట్లు కరస్పాండెంట్‌ సువర్ణగోవర్ధన్‌రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి సంబురాలు జరిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో  వందశాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా  రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తలకొండపల్లిలో 10ఉన్నత పాఠశాలల్లో 356 మంది విద్యార్థులకు గానూ 337 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తలకొండపల్లి, చంద్రధన, వెల్జాల, చుక్కాపూర్‌, కేజీబీవీ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో సర్ధార్‌ నాయక్‌ వెల్లడించారు. అదేవిధంగా మాడ్గుల మండలంలోని ఇర్విన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 99శాతం ఉత్తీర్ణత సాధించినట్లు హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. మండల టాపర్‌గా పల్లేటి శ్యామ్‌ 10జీపీఏ సాధించి నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా సెంటిమేరి ఉన్నత పాఠశాలకు చెందిన అశ్వినివాస్‌ 9.8 సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది.

ఇబ్రహీంపట్నంలో 87శాతం ఉత్తీర్ణత

ఇబ్రహీంపట్నం/మంచాల/యాచారం: ఇబ్రహీంపట్నం మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 87శాతం ఉత్తీర్ణత సాదించారు. చెర్లపటేల్‌గూడ, పోచారం, ఇబ్రహీంపట్నం ఉర్దూ బాలికల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 713మంది విద్యార్థులకు గానూ 623 మంది పాసయ్యారు. 9మంది బాలికలు 10జీపీఏ సాధించారు. పది మంది 9.8, ఇద్దరు 9.7జీపీఏ సాదించారు. పాఠశాలల వారీగా చూస్తే ఆదిభట్ల 82శాతం, రాయపోల్‌ 89శాతం, దండుమైలారం 81శాతం, శేరిగూడ 87శాతం, ఇబ్రహీంపట్నం బాలికల పాఠశాల 91 శాతం, ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాల 82 శాతం, ఎంపీపటేల్‌గూడ 80శాతం, ఎలిమినేడు 92శాతం, పోల్కంపల్లి 83శాతం, నాగన్‌పల్లి 97శాతం, కొంగరకలాన్‌ 84శాతం, కేజీబీవీ 70శాతం, బొంగులూరు మోడల్‌ స్కూల్‌ 92శాతం ఉతీర్ణత సాధించాయి. చెర్లపటేల్‌గూడ పాఠశాలకు చెందిన జక్కుల ప్రణీత, ఇబ్రహీంపట్నం బాలికల పాఠశాలకు చెందిన నేనావత్‌ అంజలి, మదీహ ఒమేమా, హరి రత్నప్రియ, శేరిగూడ పాఠశాలకు చెందిన జి.దాక్షాయని, కె.శిరీష, కొంగరకలాన్‌కు చెందిన జి.గాయత్రి, రాయపోల్‌ పాఠశాలకు చెందిన డి.యశశ్విని, ఎం.వైష్ణవిలు 10 జీపీఏ సాధించారు. ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయడంతోనే విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని హెచ్‌ఎం, ఇన్‌చార్జి ఎంఈవో కె.వెంకట్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా మంచాల మండల పరిధిలో 93.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 393మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 368మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఆరుట్ల జడ్పీ హైస్కూల్‌కు చెందిన అందోజు అవంతిక, మోడల్‌స్కూల్‌కు చెందిన ప్రత్యూషలు 10/10జీపీఏ సాధించారు. మొత్తం 68మంది విద్యార్థులు 9జీపీఏ పైగా సాధించడం విశేషం. అదేవిధంగా యాచారం మండలంలో 92.49శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 586మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 542మంది విద్యార్థులు పాసయ్యారు. నందివనపర్తి ఉన్నత పాఠశాలలో 59మందికి గానూ 59మంది, చింతపట్ల ఉన్నత పాఠశాలలో వందశాతం, యాచారం ఉన్నత పాఠశాలలో 80మందికి గానూ 77మంది పాసయ్యారు. ఇదే పాఠశాలలో ఇందు 9.8 జీపీఏ సాధించింది. గున్‌గల్‌ మోడల్‌ స్కూల్‌లో 93మందికి గానూ 89మంది పాసయ్యారు. పాఠశాలకు చెందిన ఎండీ అతి్‌ఫఅబ్రహాం పూజిత 9.7జీపీఏ సాధించింది. యాచారం కేజీబీవీ పాఠశాలలో 41మందికిగానూ 39మందిపాసయ్యారు. శ్రీలత 9.2 జీపీఏ సాధించింది. చిన్నతూండ్ల పాఠశాలలో 36మందికి గానూ 34మంది పాసయ్యారు. కీర్తన 9.5జీపీఏ సాధించింది. నల్లవెల్లి పాఠశాలలో 23మందికి గానూ 21మంది పాసయ్యారు. కుర్మిద్ద పాఠశాలలో 34మందికి గానూ 31మంది పాసయ్యారు. మేడిపల్లి ఉన్నత పాఠశాలలో 90మందికి గానూ 80మంది ఉత్తీర్ణులు కాగా సందీ్‌పరెడ్డి 9.8జీపీఏ సాధించాడు. గున్‌గల్‌ ఉన్నత పాఠశాలలో 24మందికి 21మంది పాసయ్యారు. మాల్‌ ఉన్నత పాఠశాలలో 69మందికి 59మంది, కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో 27మందికి 22 మంది పాసయ్యారు. కాగా ఆరు ప్రైవేటు పాఠశాలల నుంచి 150మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 148మంది విద్యార్థులు పాసయ్యారు. అదేవిధంగా నందివనపర్తి ఉన్నత పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను సర్పంచ్‌ ఉదయశ్రీ అభినందించారు.  

చేవెళ్లలో పెరిగిన ఉత్తీర్ణతా శాతం 

చేవెళ్ల/షాబాద్‌: చేవెళ్లలో గతేడాది 87శాతం ఉత్తీర్ణత శాతం సాధిస్తే ఈఏడాది 89శాతం ఫలితాలను సాధించారు. చేవెళ్ల మండలంలో బాలికలే అధికంగా ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. చేవెళ్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 536మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 467 మంది ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి ఆక్బర్‌ తెలిపారు. మండలంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని కె.సాత్విక, కె.శ్యాలిని 10జీపీఏ, వైష్ణవి, రవికుమార్‌, డి.కావేరి 9.8జీపీఏ సాధించారు. ఊరెళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఆస్మ, కె.నవ్య 10జీపీఏ, కె.ప్రజ్ఞ 9.2జీపీఏ సాధించారు. ఇంగ్లీష్‌ మీడియంలో 13మంది విద్యార్థులకు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో 18మందికి 15మంది పాసయ్యారు. 83శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా మండలంలోని ఆలూర్‌ జడ్పీహెచ్‌ఎ్‌స(బాలుర)లో 17మందికి 16మంది విద్యార్థులు పాసయ్యారు. ఆలూర్‌ జడ్పీహెచ్‌ఎ్‌స(బాలికలు)లో 9మందికి 9మంది పాసయ్యారు. జడ్పీహెచ్‌ఎస్‌ ఖానాపూర్‌లో 17మందికి 16మంది పాసయ్యారు. జడ్పీహెచ్‌ఎస్‌ తంగడ్‌పల్లిలో 14మందికి 13మంది విద్యార్ధులు పాసయ్యారు. జడ్పీహెచ్‌ఎస్‌ కౌకుంట్లలో 18మందికి అందరూ పాసయ్యారు. జడ్పీహెచ్‌ఎస్‌ అంతారంలో 7ఏడుగురికి అందరూ, చేవెళ్ల ప్రభుత్వ బాలికల పాఠశాలలో 55మందికి 50మంది, కందవాడ పాఠశాలలో 14మందికి 12మంది, చేవెళ్ల ప్రభుత్వ బాలుర పాఠశాలలో 61 మందికి 46 మంది, చనువల్లి పాఠశాలలో 10మందికి 8 మంది, కమ్మెట పాఠశాలలో 22 మందికి 16 మంది, మల్కాపూర్‌ పాఠశాలలో 26 మందికి 19 మంది, గుండాల పాఠశాలలో 24 మందికి 17 మంది, దేవుని ఎర్రవల్లిలో 15 మందికి 10 మంది, ఆలూర్‌ బాలికలు, అంతారం, కౌకుంట్ల ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.  మండలంలోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో 39 మందికి 38 మంది, తెలంగాణ గురుకుల పాఠశాలలో 78మందికి 77 మంది ఉత్తీర్ణులయ్యారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో కలిపి 89శాతం ఉత్తీర్ణత సాధించగా ఎంఈవో అక్బర్‌ వారిని అభినందించారు.  షాబాద్‌ మండల విద్యార్థులు 80శాతం ఉత్తీర్ణత సాధించారు. మండల వ్యాప్తంగా 484మంది పరీక్షలు రాయగా 385మంది ఉత్తీర్ణత సాధించినట్లు మండలవిద్యాధికారి శంకర్‌రాథోడ్‌ తెలిపారు.

మహేశ్వరం, కందుకూరులో..

మహేశ్వరం/కందుకూరు: మహేశ్వరం బాలికల పాఠశాలలో ఎం.ఇందుప్రియ, జి.వైష్ణవి, మహేశ్వరం బాలురు పాఠశాలలో పి.భరత్‌ సింహ, మండల ఆదర్శ పాఠశాలకు చెందిన కె.శ్రీనిధి 10జీపీఏ సాధించి మండల టాపర్లుగా నిలిచారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని నేదునూరు మోడల్‌స్కూల్‌లో 98శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కె.స్నేహ 9.8జీపీఏ సాధించి టాపర్‌గా నిలిచింది. అదే పాఠశాలకు చెందిన కె.సిరి, ఇ.వర్ష, ఐ.కావ్యలు (9.7) సాధించారు. మీర్కాన్‌పేట ఉన్నత (తెలుగు)పాఠశాలలో 56శాతం, ఇంగ్లీష్‌ మీడియంలో 91శాతం, నేదునూరు ఉన్నత పాఠశాలలో 72శాతం, కందుకూరు, బాలురుల ఉన్నత పాఠశాలలో (తెలుగు మీడియం) 81శాతం, ఇంగ్లీ్‌షమీడియంలో 34శాతం, కందుకూరు బాలికల ఉన్నత పాఠశాలలో 67శాతం, రాచులూరు ఉన్నత పాఠశాలలో 85శాతం పులిమామిడి ఉన ్నత పాఠశాలలో 64శాతం, ఆకులమైలారంలో 96శాతం, తిమ్మాపురంలో తెలుగు మీడియంలో 80శాతం, ఇంగ్లీ్‌షమీడియంలో 93శాతం, లేమూరులో తెలుగు మీడియంలో 54, ఇంగ్లీ్‌షమీడియంలో 94శాతం, గూడూరు ఉన్నత పాఠశాలలో 81శాతం, ముచ్చర్లలో 74శాతం, ఎస్‌వీవీఆర్‌ స్కూల్‌లో 86శాతం, కస్తూర్భాగాంధీ  బదిరుల పాఠశాలలో 76శాతం, నోబుల్‌స్కూల్‌లో వందశాతం, గౌతమ్‌ స్కూల్‌లో వందశాతం ఉత్తీర్ణులయ్యారు.

షాద్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలల విజయకేతనం 

షాద్‌నగర్‌/కేశంపేట/కొత్తూరు/చౌదరిగూడ/కొందుర్గు/నందిగామ, జూన్‌ 30: పదోతరగతి పరీక్షల్లో షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌, కొత్తూరు, నందిగామ, కొందుర్గు, కేశంపేట, చౌదరిగూడ మండలాల నుంచి మొత్తం 2,700మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 2,416మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రధానంగా కొత్తూరు మండలం గూడూరు ఉన్నత పాఠశాలల్లో 100శాతం ఫలితాలు గమనార్హం. నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల్లోనూ 93శాతానికి పైగా ఫలితాలు సాధించారు. ప్రఽధానంగా ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గులలోని ఉన్నత పాఠశాలకు చెందిన జోత్స్న అనే విద్యార్థిని 10జీపీఏ సాధించింది. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. కేశంపేట మండలంని మహాత్మాజ్యోతిరావ్‌ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన టి.అజయ్‌, కొందుర్గులోని ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన హేమంత్‌, అభిలాష్‌, శ్రీకాంత్‌ అనే విద్యార్థులు 10/10 సాధించారు. కొత్తూర్‌ మండలంలో బాలికలదే హవా కొనసాగింది. మండలంలో 264మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 234మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 148మంది బాలికలు ఉత్తీర్ణత పొందారు. పెంజర్ల ఉన్నత పాఠశాలలో బి.మనీషా 9.7, సిద్దాపూర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పి.శిల్ప 9.5, జీపీఏ సాధించారు.

Updated Date - 2022-07-01T06:13:41+05:30 IST