ఉధృతంగా ఉద్యమం

ABN , First Publish Date - 2022-01-29T08:51:37+05:30 IST

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ ఉద్యోగుల నిరసనలు ఉధృతమవుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణలో భాగంగా

ఉధృతంగా ఉద్యమం

కొనసాగిన ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు  


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ ఉద్యోగుల నిరసనలు ఉధృతమవుతున్నాయి. నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం రెండోరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, తాలుకా కేంద్రాల్లో ఉ ద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని, జనవరి నెలకు పాత జీతాలనే కొనసాగించాలని, అశుతోశ్‌ నివేదిక బయటపెట్టాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట జరుగుతున్న రిలే దీక్షల్లో రెండోరోజు మహిళా ఉద్యోగులు, ఉ పాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 11వ పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ఏ స్లాబుల ను యఽథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో చేపట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల రిలే దీక్షలు కొనసాగాయి. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మంకుపట్టు వీడాలని పీఆర్సీ సాధ న సమితి నాయకులు హితవు పలికారు. కాగా, రివర్స్‌ పీఆర్సీ వద్దంటూ సచివాలయ ప్రధాన ద్వారం నుంచి మొదటి బ్లాక్‌ వరకు ఉద్యోగులు వెనక్కు నడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. 

Updated Date - 2022-01-29T08:51:37+05:30 IST