ముద్దుల మీద ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రిగారూ... ఇచ్చిన హామీలు నెరవేర్చండి: ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-20T18:43:49+05:30 IST

పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి.

ముద్దుల మీద ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రిగారూ... ఇచ్చిన హామీలు నెరవేర్చండి: ఉద్యోగులు

అమరావతి: పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి. సమ్మె అస్త్రాన్ని ప్రయోగించనున్నాయి. అంతేకాదు.. గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చాయి. దీంతో ఆందోళన కారులను పోలీసులు మార్గమధ్యంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పాట రూపంలో నిరసన తెలిపారు. 


‘‘ఓ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగారూ....

ఉద్యోగులకిచ్చిన చేతిబాసలు ఏమాయే సారూ.. 

ముద్దుల మీద ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రిగారూ....

మీ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలుపుకోండి మీరు’’ అంటూ పాటపాడారు. పూర్తి పాట కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2022-01-20T18:43:49+05:30 IST