పీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ జిల్లా అధ్యక్షుడిగా పూర్ణచంద్రారెడ్డి

ABN , First Publish Date - 2020-11-30T04:43:08+05:30 IST

ఏపీ పంచాయతీరాజ్‌ మిని స్టీరియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా జె.పూర్ణచంద్రారెడ్డి ఎన్నికయ్యారు.

పీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ జిల్లా అధ్యక్షుడిగా పూర్ణచంద్రారెడ్డి
నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఎన్నికల అధికారి రామిరెడ్డి

గుంటూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఏపీ పంచాయతీరాజ్‌ మిని స్టీరియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా జె.పూర్ణచంద్రారెడ్డి  ఎన్నికయ్యారు. జడ్పీలోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా తోట శ్రీనివాసరావు, ప్రధాన  కార్యదర్శిగా షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, ట్రెజరర్‌గా ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పలువురు కార్యవర్గసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారిని జేఏసీ నేతలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూల వాతావరణం లేదన్నారు. కేంద్రప్రభుత్వం మూడు డీఏలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేయాలన్నారు.  కరోనాలో కోతవేసిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సచివాలయ వ్యవస్థ ప్రధాని మోదీ ప్రసంశలు అందుకొన్నట్లు పేర్కొన్నారు. జేఏసీ ప్రధానకార్యదర్శి జోసఫ్‌ సుధీర్‌ మాట్లాడుతూ హెల్త్‌కార్డులకు కార్పొరేట్‌ ఆసుపత్రులు వైద్యం చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కూచిపూడి మోహనరావు, జొన్నల పూర్ణచంద్రారెడ్డి, నాగిరెడ్డి, లాలపరెడ్డి, మాగంటి నరసింహమూర్తి, వీఆర్వోల అసోసియేషన్‌ నాయకుడు రాజశేఖర్‌, వీరయ్య, పాల్‌ తదితరులు ప్రసంగించారు. 

Updated Date - 2020-11-30T04:43:08+05:30 IST