జిల్లాల పునర్విభజనలో నష్టపోయేది ఉద్యోగులే: బొప్పరాజు

ABN , First Publish Date - 2022-03-13T01:34:13+05:30 IST

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో నష్టపోయేది ఉద్యోగులేనని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు

జిల్లాల పునర్విభజనలో నష్టపోయేది ఉద్యోగులే: బొప్పరాజు

విజయవాడ: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో నష్టపోయేది ఉద్యోగులేనని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో వారు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన, జిల్లా విభజనలు జరిగినపుడు ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులేనని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే 13 జిల్లాల ఏర్పాటును తాము కూడా స్వాగతిస్తున్నామని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఉద్యోగ సంఘాలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తహశీల్దార్‌ ఆఫీసు నిర్వహణ ఖర్చులకు చిల్లిగవ్వలేదని ఆరోపించారు. మౌళిక సదుపాయాలు అసలే లేవని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ ఆఫీస్‌లో విద్యుత్ నిలిపివేస్తామని ఇప్పటికే విద్యుత్‌శాఖ నోటీసులు ఇస్తోందన్నారు. ప్రభుత్వం బిల్లులను మాఫీ చేయాలని లేదా చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

Updated Date - 2022-03-13T01:34:13+05:30 IST