చర్చలకు రాలేదనడం విడ్డూరం

ABN , First Publish Date - 2022-01-28T06:23:50+05:30 IST

చర్చలకు రాలేదనడం విడ్డూరం

చర్చలకు రాలేదనడం విడ్డూరం
మచిలీపట్నం ధర్నాచౌక్‌ వద్ద జరిగిన రిలే దీక్షా శిబిరంలో కూర్చున్న ఉద్యోగులు

బందరు రిలే దీక్షల్లో ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు 

మచిలీపట్నం టౌన్‌, జనవరి 27 : మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఐఆర్‌లో రూ.వేల కోట్లు విధించడం రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్య అని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నం ధర్నాచౌక్‌ వద్ద గురువారం ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరాన్ని బొప్పరాజు ప్రారంభిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చర్చలకు రాలేదని మంత్రులనడం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిది మంది జేఏసీ ప్రతినిధులతో చర్చలకు వెళ్లామని, ఆశించిన విధంగా స్పందన లేకపోవడంతో మూడు డిమాండ్లతో వినతిపత్రం సమర్పించామని చెప్పారు. ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకు సిద్ధమన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి మాట్లాడుతూ ఐఆర్‌లో దారుణంగా కోత విధించారన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మట్టా కృష్ణయ్య మాట్లాడుతూ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ సమావేశంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు, ఏపీ జేఏసీ తూర్పుకృష్ణా చైర్మన్‌ ఉల్లి కృష్ణ, అమరావతి తూర్పుకృష్ణా చైర్మన్‌ నెల్సన్‌పాల్‌, ఏపీజీఈఏ చైర్మన్‌ పి.రాము, ఏపీజీఎఫ్‌ఏ చైర్మన్‌ కర్రా సునీల్‌, ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకూరి శ్రీనివాసరావు, ఎన్జీవోల సంఘం కార్యదర్శి సాయికుమార్‌, ఏ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 200 మంది నాయకులు, ఉద్యోగులు ఈ దీక్షలో కూర్చున్నారు.

Updated Date - 2022-01-28T06:23:50+05:30 IST