
అమరావతి: ఫిట్మెంట్ విషయంలో ఉద్యోగుల అంచనాలు తల్లకిందులయ్యాయి. ఫిట్మెంట్ 23.29 శాతం ఇస్తామని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మాత్రం 62 ఏళ్లకు పెంచుతామని జగన్ తెలిపారు. ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల్లో సమస్యలను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. జనవరి 1 నుంచి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులకు పెంచిన ఫిట్మెంట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 10,247 కోట్ల అదనపు భారం పడనుంది. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని జగన్ తెలిపారు. జూన్ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
ఇవి కూడా చదవండి