నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

Published: Fri, 21 Jan 2022 23:56:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన నిరసన తెలుపుతున్న రిమ్స్‌ సిబ్బంది

కడప(సెవెన్‌రోడ్స్‌), జనవరి 21 : కొత్త పీఆర్సీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని శుక్రవారం రిమ్స్‌లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ పీఆర్సీ వల్ల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్‌ మెడికల్‌ కాలేజీ, డెంటల్‌ కాలేజీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. సీనియార్టీ ప్రకారం టైం స్కేల్‌ను నిర్ధారించాలన్నారు. యూనియన్‌ అధ్యక్షుడు వరపుత్ర భాస్కర్‌, సుదర్శన్‌, పాపిరెడ్డి, యేసన్న, చిన్నయ్య, గఫర్‌, శారద, గౌరీ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.