ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్... బ్యాంకులకు నాలుగు రోజులు వరుస సెలవులు..!

ABN , First Publish Date - 2022-03-08T00:11:20+05:30 IST

బ్యాంకులకు ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ఉద్యోగ సంఘాలు... సమ్మె బాట పట్టినపక్షంలో... బ్యాంకులు నాలుగు రోజులపాటు పని చేయకపోవచ్చు.

ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్...  బ్యాంకులకు నాలుగు రోజులు వరుస సెలవులు..!

హైదరాబాద్ : బ్యాంకులకు ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ఉద్యోగ సంఘాలు... సమ్మె బాట పట్టినపక్షంలో... బ్యాంకులు నాలుగు రోజులపాటు పని చేయకపోవచ్చు. ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బీఎస్ రాంబాబు మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సమ్మె మార్చి 28, 29 తేదీల్లో చేయనున్నాం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం ఆపేయాలని, అలాగే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021 ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. 

Updated Date - 2022-03-08T00:11:20+05:30 IST