UAEలో అమల్లోకి కొత్త కార్మిక చట్టం.. ఉద్యోగులకు భారీ బెనిఫిట్స్!

ABN , First Publish Date - 2022-02-03T15:02:51+05:30 IST

యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గతేడాది కొత్త కార్మిక చట్టాన్ని(ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 33 ఆఫ్ 2021) ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారంతో ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్‌లోని కార్మికుల ఉద్యోగ భద్రత, సంక్షేమం లక్ష్యంగా యూఏఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రైవేట్ రంగంలోని అన్ని...

UAEలో అమల్లోకి కొత్త కార్మిక చట్టం.. ఉద్యోగులకు భారీ బెనిఫిట్స్!

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గతేడాది కొత్త కార్మిక చట్టాన్ని(ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 33 ఆఫ్ 2021) ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారంతో ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్‌లోని కార్మికుల ఉద్యోగ భద్రత, సంక్షేమం లక్ష్యంగా యూఏఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రైవేట్ రంగంలోని అన్ని వర్గాల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ సహా అన్ని వర్గాల కార్మికులకు కొత్త చట్టం రక్షణ కల్పిస్తుంది. బ్లాక్‌మెయిలింగ్, లైంగిక వేధింపులు, అధికారిక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో సహా ఉద్యోగుల పట్ల చెడుగా ప్రవర్తించడాన్ని ఇది పూర్తిగా నిషేధిస్తుంది. 


కొత్త కార్మిక చట్టం బెనిఫిట్స్..

కొత్త చట్టం ప్రకారం ప్రొబేషన్ పీరియడ్ ఆరు నెలలకు మించకూడదు. ప్రొబేషన్ సమయంలో తొలగించబడిన సందర్భంలో 14 రోజుల నోటీసు వ్యవధి ఇవ్వాలి. ఉపాధి గడువు ముగిసిన తర్వాత ఉద్యోగులు యూఏఈని విడిచి వెళ్లమని యజమానులు ఇకపై ఒత్తిడి చేయడానికి లేదు. ఉద్యోగులు ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి సులభంగా ఉద్యోగాలను మార్చుకోవచ్చు. ఇక నుంచి ఉద్యోగ ఒప్పందాలు నిర్ణీత కాలానికి ఉంటాయి. నిరవధిక ఉద్యోగ ఒప్పందాలపై ఉన్న వారందరూ ఒక ఏడాదిలోపు ఫిక్స్‌డ్-టర్మ్ ఒప్పందాలకు మారాలి. ఒక వ్యక్తి బహుళ యజమానుల వద్ద పని చేయవచ్చు. ప్రైవేట్ సెక్టార్‌లోని ఉద్యోగులు తమ రెగ్యులర్ జాబ్‌తో పాటు పార్ట్‌టైమ్ లేదా ఫిక్స్‌డ్-అవర్స్ జాబ్‌లలో పని చేయవచ్చు.


ఏడాదికి 30 రోజుల మూల వేతనం గ్రాట్యుటీగా ఇవ్వాలి. ఉద్యోగులు సంవత్సరానికి ఆరు చెల్లింపు సెలవులను ఎంచుకోవచ్చు. వారాంతపు సెలవుతో పాటు దగ్గరి బంధువులు చనిపోతే మూడు నుంచి ఐదు రోజులు సెలవులు ఇవ్వాలి. పురుషులు, మహిళలు సేమ్ జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరికీ సమాన వేతనం చెల్లించాలి. పనిచేసే చోట స్త్రీ, పురుషుల మధ్య వివక్ష ఉండకూడదు. ప్రైవేట్ రంగంలో ప్రసూతి సెలవులను 45 రోజుల నుంచి 60 రోజులకు పెంచడం జరిగింది. ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగులకు 45 రోజులు పూర్తి జీతం, 15 రోజులకు సగం జీతం పొందేందుకు అర్హులు. ప్రారంభ ప్రసూతి సెలవు పూర్తయిన తర్వాత ఏవైనా ప్రసవానంతర సమస్యలు తలెత్తితే 45 రోజుల అదనపు వేతనం లేని సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిసారి తల్లులు ప్రసూతి సెలవుతో పాటు 30 రోజుల వేతనంతో కూడిన సెలవులకు అర్హులు. అయితే, అభ్యర్థనపై కంపెనీల ముందు మెడికల్ రిపోర్టులు తప్పనిసరిగా సమర్పించాలి. ఇక కోవిడ్ అనంతర పునరుద్ధరణ చర్యలలో భాగంగా యూఏఈలో అనేక కొత్త సంస్కరణలు వస్తుండటంతో వలసదారులకు భారీ ఊరట లభిస్తోంది.  

Updated Date - 2022-02-03T15:02:51+05:30 IST