ఆస్తుల నమోదులో అవాంతరాలు

ABN , First Publish Date - 2020-10-16T07:20:51+05:30 IST

జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల సేకరణ యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నా

ఆస్తుల నమోదులో అవాంతరాలు

జిల్లాలో కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణ

ధరణిలో నమోదు చేసేందుకు సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు

సమాచారం ఇచ్చేందుకు ముందుకు రాని కొంత మంది యజమానులు


నిజామాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల సేకరణ యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నా ఉద్యోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. గ్రామాల్లో కొంత మంది వివరాలు అందించకపోవడం వల్ల నిత్యం తిరగాల్సి వ స్తోంది. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు పోయిన వారు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల నమో దు చేయడం ఆలస్యమవుతోంది. కొన్ని గ్రామాల పరిధిలో ఇళ్లను వేరే వారికి ఇచ్చి వెళ్లడం వల్ల వివరాలు దొరకక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలిసిన వారి ద్వారా ప్రయత్నాలు చేసి నమోదు చేస్తున్నారు. కొంత మంది ఆధార్‌ వివరాలు ఇచ్చినా ఇతర వివరాలు అందించకపోవడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించడం వల్ల ఆస్తుల నమోదు కొనసాగుతోంది. 


జిల్లాలో 13 రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు కొనసాగుతోంది. జిల్లాలో గ్రామపంచాయతీ లు మొత్తం 530 ఉన్నాయి. వీటితో పాటు నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలున్నాయి. గ్రామాలతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఇప్పటి వరకు నమోదు కాని ఇళ్ల యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. వారి పూర్తి డేటాను ధరణి వెబ్‌సైట్‌ లో నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతో పాటు మున్సిపాలిటీల పరిధిలో బిల్‌కలెక్టర్‌లు, ఇతర ఉద్యోగులు ఈ పనిని కొనసాగిస్తున్నారు. వివరాలను తీసుకుంటూనే వెంటవెంటనే ధరణి వెబ్‌సైట్‌లో అప్‌ డేట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇంటి యజమాని ఆధార్‌, ఇంటి వైశాల్యం, కరెంటు కనెక్షన్‌ నెంబర్‌, పింఛన్‌ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను తీసుకుంటున్నారు. ఇంటి యజమాని వివరాలతో పాటు అతని ఫొటో కూడా ధరణి వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. ఒకవేళ తల్లి, తండ్రి పేరు మీద ఉండి వారు చనిపోతే ఆ వివరాలను కూడా నమోదు చేస్తూ వారసత్వంగా ఉన్న పిల్లల వివరాలను ధరణిలో న మోదు చేస్తున్నారు. గ్రామాల పరిఽధిలోని ఇంటింటికీ తిరుగుతూ ఈ వివరాలను పెడుతున్నారు. గ్రామాల్లో పలు సమస్యలను వివరాలు సేకరించే సమయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.


ఉపాధి నిమిత్తం ఇత ర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను సేకరంచడం సమస్యగా మారుతోంది. వారి ఇళ్లను కొంత మంది అలాగే ఉంచి తల్లిదండ్రులను ఉంచి వెళుతున్నారు. వారి దగ్గర వివరాలు లేకపోవడం వల్ల ఫోన్‌లు చేసి నా కొంత మంది స్పందించడం లేదు. స్పందించిన వా రు కూడా పూర్తి వివరాలను అందించడం లేదు. కొం త మంది ఆధార్‌ కొద్ది వివరాలను ఇచ్చి వదిలివేస్తున్నారు. మరికొంత మంది ఇళ్లను కిరాయికి ఇచ్చి వెళ్ల డం వల్ల అందులో ఉన్న వారు సరైన వివరాలు అం దించకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. గ్రామాల స ర్పంచులు పర్సనల్‌గా తీసుకొని ఫోన్‌లు చేసిన చోట వివరాలు త్వరగా నమోదు అవుతున్నాయి. మరికొన్ని గ్రామాల పరిధిలో ఆలస్యమవుతున్నాయి. గల్ఫ్‌కు వెళ్లిన వారి వివరాల నమోదులో కూడా సమస్యలు ఎదు రవుతున్నాయి. వారి అన్ని వివరాలు ఇచ్చినా ఫిజికల్‌ గా ఇళ్ల ముందు ఫొటో తీసుకునే అవకాశం ఉండడం లేదు. ఈనెల 20లోపు పూర్తి వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉండడంతో గ్రామాలతో పాటు మున్సిపాలిటీల పరిధిలో వేగంగా చేస్తున్నారు.


మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉండడం వల్ల సమస్యలు తలెత్తడం లేదు.  జిల్లాలోని  గ్రామాల పరిధిలో మొత్తం 3 లక్షల 28 వేలకు పైగా వ్యవసాయేతర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 81 శాతానికి పైగా వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో నమో దు చేశారు. మొత్తంగా బుధవారం నాటికి 2 లక్షల 66 వేల మంది వివరాలను ధరణిలో ఎంట్రీ చేశారు. మిగతా ఆస్తుల వివరాలను ఒకటి, రెండు రోజుల్లో పూర్తిచేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణం గా వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాలన్నీ పూ ర్తయిన తర్వాత మళ్లీ గ్రామాల్లోని పంచాయతీల్లో వీ టిని నోటీసు బోర్డులో ఉంచుతారు. గ్రామ సభలను ని ర్వహించి తప్పొప్పులు ఉంటే నమోదు చేస్తారు. వ్యవసాయేతర ఆస్తుల పూర్తి వివరాలను ధరణిలో అందు బాటులో ఉండే విధంగా చూస్తారు. ప్రభుత్వం అన్ని వివరాలు నమోదైన తర్వాత ప్రతీ ఒక్కరికి వ్యవసాయేత ఆస్తులకు సంబంధించిన కార్డులను కూడా అం దించనున్నారు. జిల్లాలోవ్యవసాయేతర ఆస్తుల వివరాలను గత 13 రోజులుగా ధరణిలో నమోదు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపా రు. ఇప్పటి వరకు 81 శాతం పూర్తిచేశామన్నారు. కొ న్ని సమస్యలు ఉన్నా పరిష్కరిస్తూ వివరాలను ధరణిలో నమోదు చేస్తున్నామని ఆమె తెలిపారు.

Updated Date - 2020-10-16T07:20:51+05:30 IST