మహాధర్నా కోసం ఒంగోలుకు తరలిన ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-26T05:55:23+05:30 IST

మెరుగైన పీఆర్‌సీ అమలు కోసం డిమాండ్‌ చే స్తూ మంగళవారం ఒంగోలులో నిర్వహించిన ధర్నాకు కందుకూరు ప్రాంతం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.

మహాధర్నా కోసం ఒంగోలుకు తరలిన ఉద్యోగులు
ఒంగోలులో నిరసన తెలుపుతున్న తాళ్లూరు ఉద్యోగులు

కందుకూరు, జనవరి 25: మెరుగైన పీఆర్‌సీ అమలు కోసం  డిమాండ్‌ చే స్తూ మంగళవారం ఒంగోలులో నిర్వహించిన ధర్నాకు కందుకూరు ప్రాంతం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఇటీవల ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి భారీగా ఉపాధ్యాయులు తరలివెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం నాటి ధర్నాకు ఉపాధ్యాయులు కొంతమేర తగ్గినప్పటికీ ఉద్యోగులు, ఎన్‌జీవో సంఘ ప్రతినిధులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా కందుకూరు తాలూకా పీఆర్‌సీ సాధన సమితి సమన్వయకర్త  కే.రత్నాకరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదన్నారు. ఉద్యోగుల డిమాండ్లకు అనుగుణంగా పీఆర్‌సీని సాధిస్తామన్నారు.

తాళ్లూరు : పీఆర్‌సీ సాధన దిశగా జిల్లా కల్టెరేట్‌ వద్ద ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మంగళవారం తలపెట్టిన మహాధర్నాకు మండలం నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లారు. మండల ఫ్యాప్టో నేత పోలంరెడ్డి సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌యూ.ప్రసన్నకుమార్‌, నూరుల్లాలతో పాటు కార్యదర్శులు, గ్రేడ్‌ 1-6 కార్యదర్శులు, వీఆర్‌వోలు, పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో కార్యాలయాలు వెలవెలబోయాయి.

సీఎ్‌సపురం : 11వ పీఆర్‌సీని అమలుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చూస్తూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం జరిగిన ధర్నాకు ఏపీటీఎఫ్‌ నాయకులు తరలివెళ్లారు. మండలానికి చెందిన ఏపీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు దాదాపు 30మంది ధర్నాలో పాల్గొన్నట్లు ఏపీటీఎఫ్‌ మండలశాఖ నాయకులు తెలిపారు.

పామూరు : హేతుబద్దంగా లేని పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జేఏసీ ఆందోళనలో భాగంగా ఒంగోలులో జరిగే ధర్నా కార్యక్రమానికి పామూరు యూటీఎఫ్‌ నాయకులు మంగళవారం ఒంగోలుకు తరలివెళ్లారు. సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పీఆర్సీనే అమలు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమానికి వెళ్లినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎం శ్రీనివాసరాజు, గల్లా చెన్నయ్య, డోలా ఉదయ్‌కుమార్‌, కావిటి నాగేశ్వరరావు, ఎం వీరబ్రహ్మం, సుబ్బరాజు, సీహెచ్‌ ఆదిలక్షమ్మ, పేటా తిరుపతయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-26T05:55:23+05:30 IST