ముగిసిన ఉద్యోగుల బదిలీలు

ABN , First Publish Date - 2022-07-01T05:38:28+05:30 IST

ఉద్యోగుల బదిలీల జాతర గురువారం రాత్రితో ముగిసింది. పలు శాఖల్లో బదిలీల అంశంలో సిఫార్సు లెటర్లకే పెద్దపీట వేశారు.

ముగిసిన ఉద్యోగుల బదిలీలు
డీఆర్వోను కలిసేందుకు వేచివున్న ఉద్యోగులు

సిఫార్సులకే పెద్దపీట

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 30: ఉద్యోగుల బదిలీల జాతర గురువారం రాత్రితో ముగిసింది. పలు శాఖల్లో బదిలీల అంశంలో సిఫార్సు లెటర్లకే పెద్దపీట వేశారు. నిబంధన మేరకు బదిలీలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నా పారదర్శకతకు పాతర వేశారు. కలెక్టరేట్‌లో డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి అన్ని శాఖల అధికారులు బదిలీల జాబితాలు అందజేశారు. అయితే అది నిర్ణీత ఫార్మేట్‌లో లేదని వెనక్కి పంపారు. జడ్పీలో బదిలీల ప్రక్రియ ఉద్యోగుల తాకిడితో భయపడి అధికారులు అజ్ఞాత ప్రదేశానికి వెళ్లి చేపట్టారు. బదిలీల జాబితా అర్ధరాత్రి విడుదలయ్యే అవకాశం ఉంది. జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.శ్రీనివాసులు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. 

రెవెన్యూ శాఖలో....

తిరుపతి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 8మంది తహసీల్దార్లు చిత్తూరు జిల్లాకు బదిలీ కాగా చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 8మంది తహసీల్దార్లతో పాటు పలువురు బదిలీ అయ్యారు. ఈ మేరకు నోడల్‌ ఆఫీసర్‌, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి జిల్లా నుంచి వడమాలపేట తహసీల్దార్‌ ఎం. భార్గవి, కలెక్టరేట్‌ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ సీఎం శకుంతల, సీనియర్‌ అసిస్టెంట్లు ఎం.రమాసాయి, బి.వి. విజయలత, తిరుపతి జీఎన్‌ఎ్‌సఎస్‌ యూనిట్‌-1 డిప్యూటీ కలెక్టర్‌ ఆఫీసు నుంచి బి.జోసఫ్‌, టైపిస్టు ఎస్‌.శైలజ, గ్రేడ్‌-1 వీఆర్వోలు డి.సంజీవయ్య (వరదయ్యపాళెం), జి. శ్రీనివాసులు (పాకాల)లు చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి విజయపురం తహసీల్దార్‌ జి.రవీంద్రారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ ఎస్‌.అన్వర్‌ బాషా, సీనియర్‌ అసిస్టెంట్లు రేవతి (పులిచెర్ల), కె.శివకుమార్‌ (ఐరాల), ఎన్‌.శ్రీనివాసులు (కార్వేటినగరం), కలెక్టరేట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఎస్‌.మహమ్మద్‌ షరీఫ్‌, గ్రేడ్‌-1 వీఆర్వోలు పి.శివకుమార్‌ (వెదురుకుప్పం), జె.జయసింహ (నగరి)లను తిరుపతి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు 8 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. పాల సముద్రం తహసీల్దార్‌ జె. భాగ్యలత, డిప్యూటీ తహసీల్దార్‌ కె.విజయ్‌కుమార్‌ (పాలసముద్రం), సీనియర్‌ అసిస్టెంట్లు పి.నాగేశ్వర (వి.కోట), ఎం.కుమార్‌ (పుంగనూరు), జూనియర్‌ అసిస్టెంట్లు జి.సాయి తరుణ్‌ (పలమనేరు), ఎ. హరిప్రసాద్‌ (కుప్పం), ఆఫీసు సబార్డినేట్స్‌ పి.మమత (కుప్పం), జి.నరేష్‌ కుమార్‌ (కలెక్టరేట్‌) బదిలీ అయ్యారు. అన్నమయ్య జిల్లా నుంచి 8 మంది రెవెన్యూ ఉద్యోగులను చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలికిరి తహసీల్దార్‌ కె.రమణి, గుర్రంకొండ డిప్యూటీ తహసీల్దార్‌ ఆర్‌.జయంతి, సీనియర్‌ అసిస్టెంట్లు మదనపల్లి హెన్‌ఎన్‌ఎ్‌సఎస్‌ యూనిట్‌-1 పి.కళ్యాణ్‌, వై. ప్రవీణ్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్లు ఎస్‌.వసీం అహమ్మద్‌ (మదనపల్లి), టైపిస్ట్‌ పి.దినేష్‌ కుమార్‌, ఆఫీస్‌ సబార్డినేట్స్‌ కలెక్టరేట్‌ నుంచి ఎస్‌.కె.వళ్లియమ్మాళ్‌, ఆర్‌. సతీ్‌షను చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి డీఎల్‌పీవోగా పనిచేస్తున్న టి.లక్ష్మిని చిత్తూరు డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కోనా శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు డీఎల్‌పీవోగా విధులు నిర్వహిస్తున్న రూపారాణిని తిరుపతి డీఎల్‌పీవోగా బదిలీ చేస్తూ ఇన్‌చార్జి డీపీవోగా నియమించారు. చిత్తూరు డీపీవో కార్యాలయంలో డీఎల్‌పీవో (అడ్మిన్‌)గా పనిచేస్తున్న బి. సుమన జయంతిని అనంతపురం డీఎల్‌పీవోగా బదిలీ చేశారు.

అర్ధరాత్రి వరకు బదిలీలు

జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల బదిలీలు గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. జిల్లా పరిషత్‌లో 480 బదిలీలు జరగ్గా, అందులో ఏడుగురు ఎంపీడీవోలు ఉన్నారు. మిగిలిన వారు వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. రెవెన్యూలో 140, జిల్లా సహకార అధికారి ఆఫీసులో 9, వ్యవసాయ శాఖలో 68, పశుసంవర్ధక శాఖలో 37, సాంఘిక సంక్షేమ శాఖలో 106, బీసీ వెల్ఫేర్‌లో 72, గిరిజన సంక్షేమం 24, విద్యా శాఖలో 65, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 18, మత్స్యశాఖలో 2, పట్టు శాఖలో 10మంది ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇందులో ఐదేళ్లకు మించి ఒకే స్థానంలో పనిచేస్తున్నవారితో పాటు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారు.

Updated Date - 2022-07-01T05:38:28+05:30 IST