ఫొటోగ్రఫిలో మెలకువలతో ఉపాధి అవకాశాలు మెండు

ABN , First Publish Date - 2022-08-19T05:29:27+05:30 IST

ఫొటోగ్రఫిలో మెలకువలుఫొటోగ్రఫిలో మెలకువలు నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కెటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్శిటీ ఇన్‌చార్జి వీసీ సూర్యకళావతి అన్నారు.

ఫొటోగ్రఫిలో మెలకువలతో ఉపాధి అవకాశాలు మెండు
స్టాల్స్‌ను పరిశీలిస్తున్న వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్‌ సురేంద్రనాథరెడ్డి

·దేశంలోనే అత్యుత్తమ ఫొటోగ్రఫి విభాగం ఆర్కెటెక్చర్‌ యూనివర్శిటీలో ఏర్పాటు చేస్తాం

· ఇన్‌చార్జి వీసీ సూర్యకళావతి


కడప వైవీయూ, ఆగస్టు 18: ఫొటోగ్రఫిలో మెలకువలుఫొటోగ్రఫిలో మెలకువలు నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కెటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్శిటీ ఇన్‌చార్జి వీసీ సూర్యకళావతి అన్నారు. గురువారం ఆర్కెటెక్చర్‌ యూనివర్శిటీలో ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవ వేడుకలు ఫొటోగ్రఫి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఆర్కెటెక్చర్‌లోని ఫొటోగ్రఫి విభాగాన్ని వీసీ, రిజిస్ట్రార్‌ సురేంద్రనాథరెడ్డిలు కలసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తీసిన ఫొటోలను వారు తిలకించి, ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఇన్‌ఛార్జి వీసీ సూర్యకళావతి మాట్లాడుతూ చారిత్రక వాస్తవాలను, అనుభూతులను అందించేదే ఫొటోగ్రఫి అన్నారు. ఫోటోగ్రఫి పితామహుడు లూయీ స్‌ డాగ్రేని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశంలోనే అత్యున్నత ఫొటోగ్రఫిశాఖను ఆర్కెటెక్చర్‌ యూనివర్శిటీలో ప్రవేశపెడుతామన్నారు.   విద్యార్థులు మరిన్ని ఫోటోలను తీసి ప్రజల మన్నలను పొందాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సురేంద్రనాథరెడ్డి మాట్లాడుతూ ఆర్కెటెక్చర్‌ యూనివర్శిటీలోని ఫొటోగ్రఫి విద్యార్థులు ఎంతో సృజనాత్మతతో కూడిన ఫొటోలు తీసి స్టాల్స్‌లో ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఫొటోగ్రఫి శాఖకు మరిన్ని నూతన పరికరాలను అందజేస్తామన్నారు. ఫొటోగ్రఫి శిక్షణలో మెలకువలు నేర్చుకుంటే సినీరంగంలో రాణించే అవకాశం ఉందన్నారు. అనంతరం వీసీ చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. డిపార్టుమెంట్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన  ఈ కార్యక్రమం ఎంతో బాగుందని వక్తలు కొనియాడారు. అనంతరం ఫొటోగ్రఫి పితామహుడు లూయీస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను ఫొటోగ్రఫి విభాగం ఆధ్వర్యంలో సన్మానించారు. డిప్యూటీ రిజిస్ట్రార్‌ రాజేష్‌కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ పవన్‌కుమార్‌రెడ్డి,  ఫొటోగ్రఫి శాఖ  అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:29:27+05:30 IST