ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-24T07:13:25+05:30 IST

యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు.

ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

 ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు 

మిర్యాలగూడ, మే 23: యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. సోమవారం స్థానిక నాగేంద్ర ఐటీఐ, షె డ్యూల్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన మూడు నెలల ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతీ యువకులు స్వయం ఉపాధి పొందడం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 35 మందికి నైపుణ్య సర్టిఫికెట్లు,  కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళా హనుమంతరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన చిట్టిబాబు నాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు మట్టపల్లి సైదయ్యయాదవ్‌, సంస్థ నిర్వాహకులు మందడి రాంరెడ్డి, తాళ్లపల్లి రమేష్‌, మౌనిక, భవాని, రాజేశ్వరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-05-24T07:13:25+05:30 IST