నూతన విధానంతో ఉపాధి

ABN , First Publish Date - 2022-05-22T06:19:06+05:30 IST

జాతీయ నూతన విద్యా విధానంతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

నూతన విధానంతో ఉపాధి
స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఆర్‌యూను టాప్‌లో నిలిపేందుకు కృషి చేద్దాం

పరిశోధనతో కూడిన బోధన అవసరం

3వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ 


కర్నూలు(అర్బన్‌), మే 21: జాతీయ నూతన విద్యా విధానంతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. శనివారం రాయలసీమ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవానికి విజయవాడ నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన హాజరయ్యారు. ఉపకులపతి ఎ. ఆనందరావుతో కలిసి పట్టాలను ప్రదానం చేశారు. ఉదయం నుంచే దూర పాంత్రాల నుంచి డాక్టరేట్‌ల కోసండిగ్రీలు పూర్తి చేసుకున్న వారు  వేల సంఖ్యలో తరలి వచ్చారు. సభా వేదిక వద్దకు రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి పాలక మండలి సభ్యులతో పాటు రెక్టార్‌, రిజిస్ట్రార్‌, ప్రొఫెసర్లు, ఆధ్యాపకులు మేళతాళాలతో చేరుకున్నారు. ఎన్‌సీసీ క్యాడెట్ల గౌరవ వందనం అందుకుని, మార్చ్‌ ఫాస్ట్‌ చేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ ఉన్నత విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. రాయలసీమ యూనివర్సిటీని రాష్ట్ర స్థాయిలో టాప్‌ వన్‌గా నిలిపేందుకు కొత్త విద్యావిధానానికి అనుగుణంగా బోధన అందించాలన్నారు.  వృత్తి విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. కర్నూలు నగరంలో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ, క్లస్టర్‌ యూనివర్సిటీలతో పాటు రాయలసీమ యూనివర్సిటీలు ఎందరో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందించేలా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌ విద్యావిధానాన్ని అమలు చేసి విద్యాఽర్థులు నష్టపోకుండా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. యూనివర్సిటీలో కరికులంలో మార్కెట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, గేట్‌ వే తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. దీనికి తగినట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్‌ చెప్పారు. అంతకుముందు గవర్నర్‌ అనుమతితో ఉపకులపతి గౌరవ డాక్టరేట్లను పాటిబండ్ల ఆనందరావు, పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, కొలకలూరి ఇనాక్‌లకు ప్రదానం చేశారు. అనంతరం 66 మందికి బంగారు పతకాలు, 241 మందికి పీ హెచ్‌డీలు ప్రదానం చేశారు. 1,267 మందికి పీజీ,   15,339 మందికి యూజీ పట్టాలు అందించారు.   హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి బి. జగదీశ్వరరావు, రెక్టార్‌ సంజీవ రావు, రిజిస్ట్రార్‌ మధుసూధనవర్మ, డీన్‌లు, ప్రొఫెసర్లు, టిచింగ్‌, నాన్‌టిచింగ్‌ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:19:06+05:30 IST