ఉపాధి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలి

Published: Wed, 18 May 2022 23:31:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 ఉపాధి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలి చవిటిపాలెం గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌

కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌

సంతమాగులూరు, మే 18: జిల్లాలో ఉపాదికూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు మండలం చవిటిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి పల్లె కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ఆ గ్రామంలోనే నిద్రించారు. బుధవారం ఉదయం గ్రామంలోని వీధులలో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పఽథకాలు  గురించి ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె. శ్రీనివాసులు, చీరాల ఆర్‌డీవో పి. సరోజిని, డీపీవో శంకరరావు, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి ప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి, డ్వామా పీడీ ఉషారాణి, తహసీల్దార్‌ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.