
ఏలూరు: సీఎం జగన్ (Jagan) సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. రైతు భరోసా (Rythu Bharosa) సభకు అన్నదాతలు కరువయ్యారు. సభలో పలుచగా జనం కనిపించారు. జగన్ స్పీచ్ ప్రారంభం కాకముందే జనం వెళ్లిపోయారు. జనాన్ని ఆపేందుకు పోలీసుల తంటాలు పడ్డారు. కూర్చోవాలంటూ జనాన్ని పోలీసులు బతిమిలాడారు. జగన్ సుదీర్ఘ ఉపన్యాసం ప్రయోజనం ఇచ్చినా లేదు. జగన్ హామీలపై ప్రజల్లో విశ్వాసం లోపించింది. నమ్మకం లేకనే జనం రాలేదని విపక్షాలు చెబుతున్నాయి. విపక్షాలు, మీడియాపై జగన్ అక్కసు వెళ్లగక్కారు. జగన్ సభలు వెలవెలబోతుండడంతో వైసీపీ నేతలు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి