కొంగసింగిలో అంగన్‌వాడీ పోస్టు భర్తీపై విచారణ

ABN , First Publish Date - 2020-12-03T05:53:14+05:30 IST

గొలుగొండ మండలం కొంగసింగిలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు భర్తీ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు అందిన నేపథ్యంలో సీడీపీవో జీవీ రమణి బుధవారం గ్రామంలో విచారణ చేపట్టారు.

కొంగసింగిలో అంగన్‌వాడీ పోస్టు భర్తీపై విచారణ
గ్రామంలో విచారణ జరుపుతున్న సీడీపీవో జీవీ రమణి

 కృష్ణాదేవిపేట, డిసెంబరు 2 : గొలుగొండ మండలం కొంగసింగిలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు భర్తీ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు అందిన నేపథ్యంలో సీడీపీవో జీవీ రమణి బుధవారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన గ్రామస్థుల నుంచి ముందుగా వివరాలు సేకరించారు. ఈ అంగన్‌వాడీ పోస్టు జనరల్‌ కేటగిరికి కేటాయించగా, గ్రామంలో ఓసీకి చెందిన వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని దండోరా వేయించారని కొందరు ఆరోపించారు.  దీనిపై అవగాహన లేని బీసీ, ఎస్సీ, ఎస్టీల వారు దరఖాస్తు చేయలేదన్నారు. ఈ పోస్టుకు 12మంది ఓసీలు దరఖాస్తులు చేయగా, గ్రామానికి చెందిన యువతికి కేటాయించారన్నారు. ఈమె వివాహితని, స్థానికంగా సరిగా ఉండడం లేదని, అదీకాక ఈమె భర్త ప్రభుత్వ ఉద్యోగి అని  సీడీపీవోకు పలువురు విన్నవించారు. అనంతరం పీవో రమణి మాట్లాడుతూ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పి స్తానని చెప్పారు. సూపర్‌వైజర్లు సత్యవతి, భాస్కరకుమారితో పాటు  గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T05:53:14+05:30 IST