జిల్లా క్రీడాకారులకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-03-01T04:42:20+05:30 IST

జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జి ల్లాను క్రీడలకు నిలయంగా మారుద్దామని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి అన్నారు.

జిల్లా క్రీడాకారులకు ప్రోత్సాహం
కబడ్డీ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ముచ్చర్ల జనార్ధన్‌రెడ్డి

- జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి

ఊర్కొండ, ఫిబ్రవరి 28: జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జి ల్లాను క్రీడలకు నిలయంగా మారుద్దామని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ముచ్చర్లపల్లి పాఠశాల మైదానంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కబడ్డీ అసోసియే షన్‌ ఆధ్వర్యంలో కబడ్డీ జూనియర్‌ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కబడ్డీ అ సోసియేషన్‌ చైర్మన్‌ ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరెడ్డి పర్వత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లవేళలా ముందుంటామ ని తెలిపారు. దీంతో ఈ ప్రాంతం క్రీడలకు నిలయంగా మారి, రాష్ట్రం లోనే జిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. కబడ్డీ జిల్లా అసోసియే షన్‌ అఽధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్‌, యాదయ్యగౌడ్‌లు మాట్లాడు తూ ఆదివారం ముచ్చర్లపల్లిలో కబడ్డీ పోటీలు నిర్వహించి జిల్లా బాలబాలిక ల జట్లను ఎంపిక చేశామని, మార్చి 4 నుంచి 7వ తేదీ వరకు మహబూబా బాద్‌ జిల్లాలోని తొర్రూర్‌లో నిర్వహించే 47 రాష్ట్ర స్థాయి జూనియర్‌ కబడ్డీ చాంపియన్‌ షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. కో ఆఫ్షన్‌ సభ్యుడు పాషా, సీనియర్‌ క్రీడాకారుడు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డి పార్ట్‌మెంట్‌  ప్లేయర్‌ హేమంత్‌, ఉప సర్పంచ్‌ శివరాంరెడ్డి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు, పీఈటీలు రమేష్‌, రామన్‌గౌడ్‌, రాఘవేందర్‌, శివాని, మండల నాయకులు చంద్రకాంత్‌, వెంకటేష్‌, సిద్దు, సురేష్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-01T04:42:20+05:30 IST