సంగీతం, కళలకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-06-25T05:20:35+05:30 IST

సంగీతం, కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

సంగీతం, కళలకు ప్రోత్సాహం
సంగీత కళాశాలను ప్రారంభిస్తున్న మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌

- రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌

- సంగీత, నృత్య కళాశాల ప్రారంభం

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూన్‌ 24 : సంగీతం, కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. నాదస్వర విద్వాంసులను తయారు చేసేందుకు ఈ కళాశాల ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన అన్నారు. భాషా, సాంస్కృ తిక శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ బాలభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన సం గీత, నృత్య కళాశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కళాశాలను భ విష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కోర్సు చేసిన వారికి లభించే డిప్లొమా సర్టిఫికెట్‌ ద్వారా ఉద్యోగాలు కూడా లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ముని సిపల్‌ చైర్మన్‌ కేసీ న ర్సింహులు, కలెక్టర్‌ వెంకట్రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ప్రిన్సిపాల్‌ రాఘవరాజ్‌ భట్‌, రామచంద్రయ్య పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌కు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలను తీసుకువచ్చినందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ను సంగీత కళాకారులు, నాయీ బ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు.

బొడ్రాయి ప్రతిష్ఠాపనలో మంత్రి పూజలు

మహబూబ్‌నగర్‌ : ఆహ్లాదకరమైన వాతావరణంలో పేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అ న్నారు. శుక్రవారం పట్టణ సమీపంలోని వీరన్నపేట డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళ దగ్గర ఏర్పాటుచేసిన గ్రామదేవత పోచమ్మదేవి విగ్రహం, బొడ్రాయి ప్రతిష్ఠాప న కార్యక్రమంలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. సమీపంలోనే రూ. 80కో ట్లతో గురుకులం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజు, కో ఆప్షన్‌ జ్యోతి పాల్గొన్నారు.  

ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

హన్వాడ : మండలంలోని కిష్టంపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాల య నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భూమి పూజ చేశారు. శుక్రవారం మంత్రి మండలంలో పర్యటించారు. ఆలయ నిర్మాణం కోసం రూ.10 లక్షలు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం హన్వాడలో ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొండ లక్ష్మయ్య, బాలయ్య, రమణారెడ్డి, మోహన్‌, రాఘవులు, ఎంపీపీ బాలరాజు, సర్పంచు సరస్వతి, వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T05:20:35+05:30 IST