కుటుంబ పాలనను అంతమొందించాలి

ABN , First Publish Date - 2022-08-09T05:34:05+05:30 IST

మునుగోడులో ధర్మయుద్ధం మొదలైందని కేసీఆర్‌ కుటుంబ పాలన అంతమొందిం చి ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

కుటుంబ పాలనను అంతమొందించాలి
పెద్దకొండూర్‌లో పాదయాత్రగా వెళ్తున్న బండి సంజయ్‌

మునుగోడులో కాషాయ జెండా ఎగురవేయాలి 

ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

చౌటుప్పల్‌, చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 8: మునుగోడులో ధర్మయుద్ధం మొదలైందని కేసీఆర్‌ కుటుంబ పాలన అంతమొందిం చి ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యా త్ర ఆరో రోజైన సోమవారం చౌటుప్పల్‌ మండలం మసీదుగూడ నుంచి ప్రారంభించి, శెరల్లి, పెద్దకొండూరు, చిన్నకొండూరు మీదుగా చౌటుప్పల్‌, తాళ్ల సింగారం క్రాస్‌ రోడ్డు వరకు మొత్తం 13.8కిలోమీటర్లు సాగింది. రాత్రి చౌటుప్పల్‌లో నిర్వహించిన సభలో బండి సం జయ్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నక్కలగండి, డిండి, చర్లగూడెం ప్రాజెక్ట్‌లను కుర్చీవేసుకొని పూర్తిచేస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించా రు. ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వడంలేదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. చౌటుప్పల్‌లో కాలుష్యాన్ని వెదజల్లే రసాయన పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పరిశ్రమల యాజమాన్యాల నుంచి ప్రభుత్వం కోట్లాది రూపాయల ముడుపులు తీసుకొని ఎంపీ టిక్కెట్లు ఇవ్వడం శోచనీయమన్నారు. ఎన్నో రోజులు దీక్ష చేసినా పట్టించుకోని కేసీఆర్‌ బీజేపీ భయంతోనే గట్టుప్పల్‌ను ప్రకటించారన్నారు. గట్టుప్పల్‌ సర్పంచ్‌ టీఆర్‌ఎ్‌సలో చేరితేనే మండలంగా ప్రకటిస్తామని బలవంతంగా పార్టీ కండువా కప్పారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుండా కేసీఆర్‌ మోసం చేశాడన్నారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఇస్తున్నా, నిధులు రావడం లేదంటూ కేసీఆర్‌ పబ్బం గడుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేసీఆర్‌ గడీలను బద్ధలు కట్టి తెలంగాణ తల్లికి విముక్తి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి కేసీఆర్‌ మోసాల ను ప్రజలకు వివరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల గురించి తెలపాలన్నారు. మునుగోడు ప్రజలు గతంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీ అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటుకు 30వేలు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని, ఆ డబ్బు తీసుకొని ఓటు మాత్రం బీజేపీకి వేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ చర్లగూడెం రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం అడిగితే పోలీసులతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరేందర్‌గౌడ్‌, స్వామిగౌడ్‌, ప్రదీ్‌పకుమార్‌, సంగప్ప, బంగారు శృతి, పీవీ.శ్యాంసుందర్‌, బూడిద భిక్షమయ్యగౌడ్‌, కడగంచి రమేష్‌, కాసం వెం కటేశ్వర్లు, కొప్పు భాష, శ్రీరాములు, కుమార్‌, రాణి రుద్రమ, దూడల భిక్షంగౌడ్‌, దోనూరి వీరారెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, రామనగోని శంకర్‌, శ్రీనివా్‌సరెడ్డి, బాతరాజు సత్యం, ఊడుగు వెంకటేశం,  శ్రీదర్‌బాబు, ఆలె నాగరాజు, బండమీది మల్లేశం పాల్గొన్నారు.


ఆరో రోజు యాత్ర సాగిందిలా...

బండి సంజయ్‌ పాదయాత్ర చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెం నుంచి ప్రారంభమై శేరిల్లా, పెద్దకొండూర్‌, చిన్నకొండూర్‌ గ్రామాల గుండా కొనసాగింది. పెద్దకొండూర్‌, మసీదుగూడెంలో మహిళలు బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. బీజేపీ మహిళా నాయకులు  స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. బండి సంజయ్‌ పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. చిన్నకొండూరు రోడ్డులో కొద్దిదూరం బీజేపీ కార్యకర్తలు సంజయ్‌ను భుజాలపై మోసుకుంటూ ఊరేగించారు. పెద్దకొండూర్‌లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మఽధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం మెనూ, సన్న బియ్యం, దొడ్డు బియ్యం పెడుతున్నారా అని  విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. చిన్నకొండూర్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. గ్రామంలో వందశాతం కరోనా టీకాలు వేసినందుకు స్థానిక నర్సు, ఏఎన్‌ఎంను శాలువాలతో సన్మానించారు.


నేటి యాత్ర ఇలా

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఏడో రోజైన మంగళవారం చౌటుప్పల్‌ మండలంలో పాదయాత్ర కొనసాగనుంది. తాళ్లసింగారం, కొత్తపేట, లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి టోల్‌ ప్లాజా, రెడ్డిబాయి, తుంబాయిస్టేజి, గుండ్లబాయి మీదుగా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చేరుకుంటుంది.


Updated Date - 2022-08-09T05:34:05+05:30 IST