పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధులు

ABN , First Publish Date - 2021-07-23T04:01:36+05:30 IST

సీజనల్‌ వ్యాధుల కాలం మొ దలైంది.

పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధులు
నిల్వ నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్‌)

- ప్రారంభమైన సీజనల్‌ వ్యాధుల కాలం

- నదీ పరివాహక ప్రాంతాల్లో అధిక ప్రభావం

- అప్రమత్తమైన వైద్య, ఆరగ్యో శాఖ యంత్రాంగం

- వనపర్తి జిల్లాలో 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు

- హైరిస్క్‌ కేటగిరీలో 77 ప్రాంతాల గుర్తింపు


వనపర్తి (వైద్య విభాగం), జూలై 22 : సీజనల్‌ వ్యాధుల కాలం మొ దలైంది. రెండో దశ కరోనా వ్యాప్తి నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ప్ర జలపై దోమల దండు దాడికి సిద్ధమవుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉం దని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

రెండు సంవత్సరాలుగా వనపర్తి జిల్లాలో సీజనల్‌ వ్యాధుల కేసులు పె రుగుతున్నాయి. 2019లో 15 మలేరియా కేసులు, 95 డెంగీ కేసులు, ఐదు చికున్‌గున్యా కేసులు నమోదు కాగా, 2020లో 29 మలేరియా, 73 డెంగీ కే సులు వచ్చాయి. తాజాగా ఈ ఏడాది ఇప్పటికే 11 డెంగీ కేసులు నమోద య్యాయి. ఈ కేసులన్నీ కమాలొద్దీన్‌పూర్‌, కడుకంట్ల, పెబ్బేరు, కొత్తకోట, మదనాపురం, తిప్పడంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నమోద య్యాయి. అలాగే గతేడాది నందిమల్ల, మూలమల్ల, మొట్లంపల్లి గ్రామాల్లో అధికారులు 6,600 దోమతెరలు పంపిణీ చేశారు. దోమల నివారణకై రాత్రి వేళ్లల్లో ఫాగింగ్‌, పైరేత్రం స్ర్పేలను కూడా పిచికారి చేయించారు.


గంబూసియా చేప పిల్లల పెంపకం

వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ గా నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిలోనే దోమ లార్వ వృద్ధి చెంది, దోమల వ్యాపిస్తాయి. దీన్ని నివారించేందుకు వైద్య, ఆగర్యో శాఖ గంబూసియా చే ప పిల్లలను పెంచుతోంది. ఈ చేపలు దోమ లార్వను తిని, దోమల వ్యాప్తి ని అరికడతాయి. వీటిని మత్స్య శాఖ ద్వారా హైదరాబాద్‌ నుంచి దిగుమ తి చేసుకుంటోంది. ఇప్పటికే పెద్దమందడి, మదనాపూర్‌, పెబ్బేరు ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలలో వీటిని పెంచుతున్నారు. అలాగే ఎక్కువ రోజులు ని ల్వ నీరు ఉన్న ప్రదేశాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్నారు. ప్రతీ శుక్రవారం ఫ్రై డే డ్రైడే కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వాడి పారేసిన ప్లాస్టిక్‌ గ్లాసులు, కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఇంట్లో ఉండే పూల మొక్కల కుండీలు, కూలర్లలో నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలని, ఇంటి పిరసరాల్లో చెత్తచెదారం లేకుండా శుభ్రంగా ఉండే ట్లు చూసుకోవాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - 2021-07-23T04:01:36+05:30 IST