ముగిసిన మూడో రోజు ఆట.. భారత‌కు 63 పరుగుల ఆధిక్యం

ABN , First Publish Date - 2021-11-27T22:21:55+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 14 పరుగులు

ముగిసిన మూడో రోజు ఆట.. భారత‌కు 63 పరుగుల ఆధిక్యం

కాన్పూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని మొత్తం లీడ్ 63 పరుగులకు చేరుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 296 పరుగుల వద్ద ముగిసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ శుభమన్ గిల్ వికెట్‌ను కోల్పోయింది. మూడు బంతుల ఆడిన గిల్ ఒకే ఒక్క పరుగు చేసి జెమీసన్ బౌలింగులో బౌల్డయ్యాడు. మయాంక్ అగర్వాల్ 4, చతేశ్వర్ పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 


అంతకుముందు న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. లాథమ్ 95, యంగ్ 89 పరుగులు చేశారు. భారత బౌలర్లలో  అక్సర్ పటేల్ ఐదు వికెట్లు తీసుకోగా, అశ్విన్ మూడు, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2021-11-27T22:21:55+05:30 IST