కనీస వేతన చట్టాన్ని అమలు చేయించండి

ABN , First Publish Date - 2021-01-17T05:55:35+05:30 IST

మెప్మా ఆర్పీల గౌరవవేతనాన్ని పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హర్షణీయమని, అయితే కనీసవేతన చట్టాన్ని అమలు చేస్తూ పెంచాలని మెప్మాఆర్పీల సంఘం రాష్ట్రశాఖ ప్రభుత్వాన్ని కోరింది.

కనీస వేతన చట్టాన్ని అమలు చేయించండి
ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం సమర్పిస్తున్న సభ్యులు

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 16:మెప్మా ఆర్పీల గౌరవవేతనాన్ని పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హర్షణీయమని, అయితే కనీసవేతన చట్టాన్ని అమలు చేస్తూ పెంచాలని మెప్మాఆర్పీల సంఘం రాష్ట్రశాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు శనివారం వారు ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. వారు పెట్టుకున్న ఆర్జీపై కవితతో ఎండార్స్‌మెంట్‌చేయించి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2021-01-17T05:55:35+05:30 IST