Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

ABN , First Publish Date - 2022-09-19T03:39:38+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాబిన్ డిక్షనరీ పేరుతో రామచంద్ర పిళ్ళై వ్యాపారం చేశారు. అయితే ఢిల్లీ రాజకీయ ప్రముఖులకు రామచంద్ర పిళ్లై పెద్ద మొత్తంలో ...

Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాబిన్ డిక్షనరీ పేరుతో రామచంద్ర పిళ్ళై Ramachandra Pillai) వ్యాపారం చేశారు.  అయితే ఢిల్లీ రాజకీయ ప్రముఖులకు రామచంద్ర పిళ్లై పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇండో sprit సంస్థతో పాటు కొంతమంది నుంచి రెండు కోట్ల 30 లక్షల రూపాయలు మేర వసూలు చేసి ఢిల్లీ రాజకీయ ప్రముఖులకు ఇచ్చినట్టుగా రామచంద్ర పిళ్లైపై ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో రామచంద్ర పిళ్ళైను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా రామచంద్ర పిళ్లైను విచారిస్తున్నారు.  అయితే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అధికారులు రామచంద్ర పిళ్లైను 14వ నిందితుడిగా ఎఫ్ఆర్‌లో చేర్చారు. దీంతో ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచారు.

Updated Date - 2022-09-19T03:39:38+05:30 IST