పది ప్రాంతాల్లో Engineering‌ Counseling‌

ABN , First Publish Date - 2022-05-10T16:27:16+05:30 IST

అన్నా విశ్వవిద్యాలయ పరిధిలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ పది ప్రాంతాల్లో ప్రత్యక్షంగా నిర్వహించే అంశం ప్రభుత్వ పరిశీలనలో

పది ప్రాంతాల్లో Engineering‌ Counseling‌

చెన్నై/పెరంబూర్‌: అన్నా విశ్వవిద్యాలయ పరిధిలో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ పది ప్రాంతాల్లో ప్రత్యక్షంగా నిర్వహించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి మాట్లాడుతూ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు. ఇందుకు మంత్రి బదులిస్తూ కౌన్సిలింగ్‌ పారదర్శకంగా నిర్వహించేలా 10 ప్రాంతాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్ధం 20 కి.మీ లోపు ఉండేలా కొత్త ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలు ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Read more