ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఈ శ్రీకాంత్‌రావు

ABN , First Publish Date - 2021-07-24T06:23:30+05:30 IST

కృష్ణా పరివాహక ప్రాతంలో ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల తో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టు లన్నీ నిండుకుండలా మారా యని, సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని, త్వరలో సాగర్‌కు కూడా వరద రాక కొనసాగుతుంది కావున ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు సీఈ శ్రీకాంత్‌రావు ఆదేశిం చారు.

ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఈ శ్రీకాంత్‌రావు
డ్యాం కంట్రోల్‌ రూంలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలిస్తున్న సీఈ శ్రీకాంత్‌రావు

నాగార్జునసాగర్‌, జూలె ౖ23: కృష్ణా పరివాహక ప్రాతంలో ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల తో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టు లన్నీ నిండుకుండలా మారా యని, సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని,  త్వరలో సాగర్‌కు కూడా వరద రాక కొనసాగుతుంది కావున ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు సీఈ శ్రీకాంత్‌రావు ఆదేశిం చారు. శుక్రవారం ఆయన సాగర్‌ ప్రధాన డ్యాం రేడియల్‌ క్రస్ట్‌ గేట్లకు అమరుస్తున్న రబ్బరు సీళ్లను, ఇతర మరమ్మతు పనులను పరిశీలించారు. వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం కుడి వైపు కంట్రోల్‌ రూంలో నీటి నమోదు వివరాలను పరిశీలించారు. ఆ తర్వాత ఎడమ వైపు కంట్రోల్‌ రూంలో  జనరేటర్‌, లిప్టు పనితీరును పరిశీలించారు. ఆ తర్వాత ప్రధాన డ్యాం గేటు ముందున్న సీసీ కెమెరాల పుటేజీ గదిని పరిశీలించారు. సీసీ కెమరాల పనితీరును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎస్‌ఈ ధర్మానరాయక్‌ ఉన్నారు. 

Updated Date - 2021-07-24T06:23:30+05:30 IST