కోహ్లీ ఎప్పటికీ ధోనీ కాలేడు: నాసిర్ హుస్సేన్

ABN , First Publish Date - 2020-07-06T21:34:56+05:30 IST

కోహ్లీ ఎప్పటికి ధోనీ కాలేడు అని ఇంగ్లాండ్ మాజీ కెప్టన్ నాసిర్ హుస్సేన్ అన్నారు. ధోనీ తరువాత..

కోహ్లీ ఎప్పటికీ ధోనీ కాలేడు: నాసిర్ హుస్సేన్

లండన్: కోహ్లీ ఎప్పటికీ ధోనీ కాలేడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నారు. ధోనీ తరువాత కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీపై చాలా బాధ్యతలు ఉంటాయని నాసిర్ పేర్కోన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాసిర్ హుస్సేన్ కోహ్లీ, ధోనీలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధోనీ తరువాత అలాంటి కెప్టెనే కావాలని అభిమానులు కోరుకుంటారని, అయితే కోహ్లీ అందుకు పూర్తి బిన్నంగా ఉంటాడని నాసిర్ పేర్కొన్నారు. ‘ధోనితో పోలిస్తే కోహ్లీ భిన్నమైన కెప్టెన్. అతడు ఎప్పటికీ ధోనీలా కూల్‌గా ఉండలేడు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేడు. కోహ్లీ ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉంటాడు. ఆ దూకుడుతోనే ప్రత్యర్థిపై పట్టు సాధించాలని అనుకుంటాడు. ఇదే అతడి విజయరహస్యం’ అంటూ కోహ్లీపై నాసిర్ ప్రశంసల వర్షం కురింపించాడు. అంతేకాకుండా కోహ్లీ  మరొకరి మార్గాన్ని అనుసరించడని, తనకంటూ ప్రత్యేక పంథా ఏర్పరుచుకుని ముందుకెళతాడని నాసిర్ చెప్పుకొచ్చాడు.


ఇదిలా ఉంటే కోహ్లీ 2015లో భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 2017లో వన్డే జట్టుకూ కెప్టెన్ అయ్యాడు. కోహ్లీ కెప్టెన్ అయ్యాక కూడా ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ కెప్టెన్సీ సంబంధించి అనేక మెళకువలు నేర్చుకున్నాడు.

Updated Date - 2020-07-06T21:34:56+05:30 IST