England vs India: టీ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్ విలవిల

ABN , First Publish Date - 2022-07-05T02:24:10+05:30 IST

భారత్ నిర్దేశించిన 378 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ టీ బ్రేక్

England vs India: టీ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్ విలవిల

బర్మింగ్‌హామ్: భారత్ నిర్దేశించిన 378 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత మాత్రం వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు అలెక్స్ లీస్, జాక్ క్రాలీ ఇద్దరూ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 46 పరుగులు చేసిన క్రాలీని బుమ్రా బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.


అయితే, ఆ తర్వాత వచ్చిన ఒల్లీపోప్(0)ను కూడా అదే స్కోరు వద్ద బుమ్రా పెవిలియన్ పంపాడు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన అలెక్స్ లీస్ (56) లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి 107/1తో బలంగా ఉన్నట్టు కనిపించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత రెండు పరుగులకే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం రూట్, జానీ బెయిర్‌స్టో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి భారత్ కంటే 261 పరుగుల వెనక ఉంది.

Updated Date - 2022-07-05T02:24:10+05:30 IST