ICC Women's World Cup: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి

ABN , First Publish Date - 2022-03-16T17:32:25+05:30 IST

మహిళల ప్రపంచకప్‎లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది.

ICC Women's World Cup: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి

మౌంట్‌ మాంగనుయ్‌: మహిళల ప్రపంచకప్‎లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. టీమిండియా నిర్ధేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సునాయాసంగా చేధించింది. ఇంకా 112 బంతులు మిగిలిఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లీష్ జట్టు టార్గెట్‌ను అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా బ్యాటర్లు చెతులెత్తేశారు. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(35), రిచా ఘోస్(33), ఝలన్ గోస్వామి(20) పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. దాంతో మిథాలీసేన 36.2 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 




అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ప్రారంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తడబడినట్లు కనిపించిన ఆ తర్వాత కోలుకుంది. కెప్టెన్ హీథర్ నైట్(53 నాటౌట్), నాట్ స్కివర్(45) జోడీ అదుకుంది. మూడు వికెట్‌కు ఈ ద్వయం ఏకంగా 65 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన హీథర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. చివరికి 31.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో మేఘన సింగ్ 3 వికెట్లు తీస్తే.. ఝులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.      

Updated Date - 2022-03-16T17:32:25+05:30 IST