AP: వైసీపీ వాట్సప్‌ గ్రూప్‌లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్

ABN , First Publish Date - 2022-04-29T18:09:06+05:30 IST

జిల్లాలోని ఆమడగూరు మండల కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ కలకలం రేపుతోంది.

AP: వైసీపీ వాట్సప్‌ గ్రూప్‌లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్

శ్రీసత్యసాయి: జిల్లాలోని ఆమడగూరు మండల కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ కలకలం రేపుతోంది. ఉదయం 11 గంటల నుంచి వైసీపీ వాట్సాప్ గ్రూపులో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకు గ్రూప్‌లో క్వశ్చన్ పేపర్‌ను కొందరు వ్యక్తులు షేర్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ హై స్కూల్ అటెండర్‌పై  విద్యాశాఖ  అనుమానాలు వ్యక్తం చేస్తోంది. వైసీపీ నేతలతో కుమ్మకై క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-04-29T18:09:06+05:30 IST