మిర్చి, పొగాకు రైతులకు అపార నష్టం

ABN , First Publish Date - 2021-11-27T06:23:42+05:30 IST

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కందుకూరు ప్రాంతంలోని మిరప, పొగాకు రైతులకు అపార నష్టం జరిగింది.

మిర్చి, పొగాకు రైతులకు అపార నష్టం
దెబ్బతిన్న మిరప పంట

కందుకూరు, నవంబరు 26  : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కందుకూరు ప్రాంతంలోని మిరప, పొగాకు రైతులకు అపార నష్టం జరిగింది. వర్షాలు తెరపిచ్చి ఎండా కాసేకొద్ది నష్టం తీవ్రత జరుగుతోంది.

కందకూరు ప్రాంతంలో 1600 ఎకరాల్లో మిరప తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రెండురోజులుగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే మిరపకు జరిగిన నష్టం మరింత పెరుగు తోందని భావిస్తున్నారు. అధికారిక లెక్కలకు మించి నష్టం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కందుకూరు ఉద్యానశాఖ సబ్‌ డివిజన్‌ పరిఽధిలోని కందుకూరు మండలంలో 150 ఎకరాలు, వలేటివారిపాలెం మండలంలో 220 ఎకరాలు, లింగసముద్రం మండలంలో 240 ఎకరాలు, గుడ్లూరులో 205 ఎకరాలు, పొన్నలూరులో 205 ఎకరాలు, ఉలవపాడు మండలంలో 75 ఎకరాలు, జరుగుమల్లిలో 100, టంగుటూరులో 17, సింగరాయకొండలో 158, కొండపిలో 142 ఎకరాల్లో మిరపతోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉంటాయని భావిస్తున్నారు. కనీసం 2000 వేల ఎకరాల్లో మిరపతోటలు పూర్తిగా దెబ్బతినాయని  రైతులు అంచనా వేస్తుండగా, వారికి వచ్చిన నష్టం కేవలం పెట్టుబడి రూపంలోనే రూ. 12 కోట్ల వరకు ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న మిరపతోటలు కాపు దశలో ఉన్నందున ఇప్పటికే ఎకరాకి కనీసం రూ. 60 వేల పెట్టుబడి అయిందని ఈ స్థితిలో మిరపతోటలు నిలువనా ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు లబోదిబో అంటున్నానరు. మిరప తిరిగి సాగుచేయాలన్నా.., అదును దాటిపోవడంతో అర్ధంకాని స్థితిలో ఉన్నారు. ఎకరా రెండెకరాల్లో చిన్న కమతాల్లో మిరప తోటలు వేసిన రైతుల బాధ ఒకరకంగా ఉండగా ఐదారెకరాలు సాగు చేసి నష్టపోయిన రైతుల పరిస్థితి ధైన్యంగా మారింది.

 పొగాకు రైతులకు తీరని నష్టం 

కందుకూరు ప్రాంతంలోని పొగాకు రైతులకు కూడా ఈ వర్షాల వలన తీవ్ర నష్టం వటిల్లింది. అనేక పొగమొక్కలు వర్షాలకు నేల కరుచుకొని ఎండిపోయాయి. వర్షాల తరువాత మిగిలిన తోటలకు కూడా బొబ్బర తెగులు సోకడంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. కందుకూరులోని రెండు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో 3500 ఎకరాల వరకు పొగ తోటలు దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు. పొగ నాట్లు తిరిగి వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటికే సేద్యాలు, నారు కొనుగోలు, యాత కూలీలు లకు ఎకరానికి కూ. 12000 లకు పైగా ఖర్చయిందని ప్రస్తుతం తిరిగి నాట్లు వేయాలంటే నారు ధరలు పెరిగాయని రైతులు పేర్కొంటున్నారు. దీంతో అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు ప్రాంతంలో పొగాకు రైతులకు జరిగిన నష్టం రూ. 4 కోట్లపైనే ఉంటుందని అంచనా. పంటనష్టాలను ఖచ్చితంగా నమోదు చేసి ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుకుంటునన్నారు.

Updated Date - 2021-11-27T06:23:42+05:30 IST