అవినీతిపై విచారణ

ABN , First Publish Date - 2021-03-06T06:51:54+05:30 IST

ఎస్సీ, ఎస్టీ రైతులకు విద్యుత్‌ కనెక్షన్స్‌ ఇచ్చేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటులో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ అధికారులు విచారణ కొనసాగుతోందని, నివేదిక అందగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం.శివప్రాసాద్‌రెడ్డి అన్నారు.

అవినీతిపై విచారణ
మాట్లాడుతున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌ రెడ్డి

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌ రెడ్డి  

విస్సన్నపేట, మార్చి 5: ఎస్సీ, ఎస్టీ రైతులకు విద్యుత్‌ కనెక్షన్స్‌ ఇచ్చేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటులో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ అధికారులు విచారణ కొనసాగుతోందని, నివేదిక అందగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం.శివప్రాసాద్‌రెడ్డి అన్నారు. విస్సన్నపేట విద్యుత్‌ ఏడీ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయనతో పాటు ఎనర్జీశాఖ డీఈ విజయకుమారిలు సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలతో సహా అన్ని విద్యుత్‌ బకాయిలు వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడీ అశోక్‌కుమార్‌, నూజివీడు డీఈ  ప్రసాద్‌, విస్సన్నపేట, చాట్రాయి, రెడ్డిగూడెం మండలాల ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-06T06:51:54+05:30 IST