అవినీతి ఆరోపణలు.. ఏఈపై విచారణ

ABN , First Publish Date - 2022-05-24T06:29:50+05:30 IST

అవినీతి ఆరోపణలు.. ఏఈపై విచారణ

అవినీతి ఆరోపణలు.. ఏఈపై విచారణ
మండల పరిషత్‌ కార్యాలయంలో విచారణ చేస్తున్న పంచాయతీరాజ్‌ అధికారులు

పోలవరం, మే 23: పంచా యతీరాజ్‌ ఏఈ వెంకటేశ్వరరావు తన వద్ద సీసీ రోడ్ల బిల్లుల కోసం రూ.70 వేలు లంచం తీసు కున్నారని రెండు రోజుల క్రితం పట్టిసీమ సర్పంచ్‌ సబ్బారపు శ్రీరామ్మూర్తి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆరోపిం చారు. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వార్తా కథనాన్ని ప్రచురించింది. దీంతో అధి కారులు స్పందించారు. సోమవారం కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఆదేశాలతో ఏలూరు జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రభాస్కరరెడ్డి నేతృత్వంలో జంగారెడ్డిగూడెం పంచాయ తీరాజ్‌ ఈఈ శ్రీను, కొయ్యలగూడెం పంచా యతీరాజ్‌ సబ్‌ డివిజన్‌ డీఈ సీతయ్య, చింతలపూడి పంచాయతీరాజ్‌ డీఈ ఎస్‌వీ రామన్‌, గోపాలపురం, పోలవరం డీఈ బాలకృష్ణతో కూడిన బృందం పోలవరం మండల పరిషత్‌ కార్యాలయంలో బాధి తులు, సర్పంచులు, కార్యదర్శులతో మాట్లా డింది. వారి వద్ద స్టేట్‌మెంట్లు తీసుకుని, వాటిని రికార్డు చేసింది.
ఏఈతో రహస్య మంతనాలు?
విచారణ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తామని వెళ్లిన అధి కారులు పట్టిసీమ రివర్‌ ఇన్‌ అతిథి గృహంలో భోజన విరామానంతరం పట్టి సీమ శివక్షేత్రానికి వెళ్లి వచ్చారు. అటు నుంచి ఏలూరు తిరుగు ప్రయాణమ య్యారు. విచారణకు వచ్చిన అధికారు లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈతో రివర్‌ ఇన్‌ అతిథి గృహంలో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం.

Updated Date - 2022-05-24T06:29:50+05:30 IST