ఈ నెలలో అలరించే పీసీ గేమ్స్‌

ABN , First Publish Date - 2022-08-06T05:58:06+05:30 IST

పీసీ గేమ్స్‌ ఆడే వ్యక్తులకు ఈ నెల పండగే అని చెప్పవచ్చు. అయిదు ఆటలు వారికి అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ నెలలో అలరించే పీసీ గేమ్స్‌

పీసీ గేమ్స్‌ ఆడే వ్యక్తులకు ఈ నెల పండగే అని చెప్పవచ్చు. అయిదు ఆటలు వారికి అందుబాటులోకి వస్తున్నాయి. సంఖ్యపరంగా ఫిబ్రవరిలో విడుదలైన అన్ని కానప్పటికీ ఈసారి వస్తున్న గేమ్స్‌ ఆసక్తిపరులను ఆకర్షిస్తున్నాయని సమాచారం. వివరాల్లోకి వెళితే


థైమీసియా: ఆర్‌పీజీ జనీర్‌(ఒక స్టయిల్‌ - ఆర్టిస్టిక్‌, మ్యూజికల్‌ లేదంటే లిటరరీపరంగా)కు ఆసక్తి కలిగించే ట్విస్ట్‌ ఈ గేమ్‌లో ఉంటుంది. ఈ గేమ్‌లో శత్రువులపై మరణం లేదంటే వ్యాధి కలిగించే పాటి శక్తిని ప్లేయర్లు ఉపయోగించాలి. ఓవర్‌ బోర్డర్‌ స్టూడియో దీన్ని డెవలప్‌ చేసింది. టీమ్‌17 పబ్లిష్‌ చేసింది. మెయిన్‌ క్యారెక్టర్‌ కోర్వస్‌, మధ్య యుగం నాటి యుద్ధాలను తలపిస్తాడు. ప్లేగును ఆయుధంగా ఉపయోగిస్తాడు. ఈ గేమ్‌ ఆగస్టు 18న విడుదల కానుంది.

సెయింట్స్‌ రో: సెయింట్స్‌ రో లో నాలుగోది 2013లో వచ్చింది. ఈ సిరీస్‌లో తదుపరి గేమ్‌ కోసం అభిమానులు పదేపదే అడుగుతుండేవారు. తాజాగా రాబోతున్నది సరికొత్త కానప్పటికీ ఆ గేమ్‌ అభిమానులను అలరించనుంది. ఈ ఆటలో కోర్‌ విషయంలో మార్పులేదు. అనుచిత వ్యాపారంతో సాధించిన మొత్తాలతో కోరికలను తీర్చుకోవడమే ఇందులో కూడా థీమ్‌. అయితే గ్రాఫిక్స్‌ నుంచి గేమ్‌ మెకానిక్స్‌కు మార్చారు. డీటైల్డ్‌ క్యారెక్టర్‌ క్రియేటర్‌కు తోడు డ్రాప్‌-ఇన్‌ కోఆపరేటివ్‌ మల్టీప్లేయిర్‌ మోడ్‌లో ఉంటుంది. ఆగస్టు 23న విడుదల కానుంది.


హెర్త్‌స్టోన్‌: మర్డర్‌ ఎట్‌ కేజల్‌ నత్రియా:

ఇది రెండో విస్తరణ. 135 కంటే ఎక్కువ కార్డులతో  - లొకేషన్‌ కార్డు తరహాలో ఉంటుంది. కీవర్డ్‌ను కనిపెట్టాలి. సరికొత్త మెకానిక్స్‌ను జోడించారు. కాంబినేషన్లు కూడా ఉన్నాయి. ఈ గేమ్‌ ఇప్పటికే విడుదలైంది.


టోటల్‌ వార్‌: వార్‌హేమర్‌ 3 ఇమ్మోర్టల్‌ ఎంపైర్స్‌:

మూడు క్యాంపైన్స్‌ను కలగలిపి ఆగస్టు 23న తీసుకువస్తున్నారు. ఇంతకు మునుపు మాదిరిగా యుద్ధంలో బతికిబట్టకట్టడం, లక్ష్యాలు వంటివి కాకుండా మరో రూపం తీసుకున్నారు. చాలా మార్పులు ఉన్నాయి. రేస్‌ విషయంలో అదనంగా కొంత చేర్చారు. విజయానికి సంబంధించిన కండిషన్స్‌లోనూ మార్పు చేశారు. పూర్తిగా డిఫరెంట్‌ గేమ్‌ను ప్లేయర్లు ఆశించవచ్చు.


ఇమ్మోర్టాలిటి: ఇది ఇతర గేమ్స్‌లాంటిది కాదు. నెరేటివ్‌ ఫోకస్డ్‌ గేమ్‌. అర్కైవల్‌ ఫుటేజ్‌ని ప్లేయర్లు మొదట గమనించాలి. మిస్సింగ్‌ యాక్టరస్‌ - మారిస్సా మార్సెల్‌కు సంబంధించిన మిస్టరీ అప్పుడే వీడుతుంది. ఈ గేమ్‌ నెలాఖర్లో అంటే ఆగస్టు 30న అందుబాటులోకి వస్తోంది. 

Updated Date - 2022-08-06T05:58:06+05:30 IST