పారిశ్రామికవేత్తల చూపు తెలంగాణ వైపు

ABN , First Publish Date - 2022-06-29T06:29:03+05:30 IST

దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.

పారిశ్రామికవేత్తల చూపు తెలంగాణ వైపు
వాటర్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

 రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

చౌటుప్పల్‌ రూరల్‌, జూన 28: దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు.  మండలంలోని దండుమల్కాపురం శివారులోని గ్రీన ఇండస్ర్టియల్‌ పార్క్‌లో సోడాహబ్‌, లయన్సక్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంటును మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల విజనతో నేడు తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకుపోతోందన్నారు.  కార్యక్రమంలో టిఫ్‌(తెలంగాణ ఇండస్ర్టియల్‌ ఫెడరేషన) చైర్మన కె.సుధీర్‌రెడ్డి, సోడా హబ్‌ పరిశ్రమ ఎండి నందా శ్రీనివా్‌సరావు, లయన్స క్లబ్‌ ప్రతినిధులు హరిహరసుబ్రహ్మణ్యం, మల్లిఖార్డున, మనోహర్‌రెడ్డి, రామరావు, చైతన్య, శివకుశాల్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-06-29T06:29:03+05:30 IST