వరద బాధిత గ్రామాల్లో నష్టం అంచనా

ABN , First Publish Date - 2022-08-08T06:52:23+05:30 IST

గోదావరి వరదలకు ముంపునకు గురైన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించేందుకు ఇళ్ల పరిస్ధితిని అంచనా వేసేందుకు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ విభాగం ఆదివారం ఎన్యూమరేషన్‌ ప్రారంభించారు.

వరద బాధిత గ్రామాల్లో నష్టం అంచనా
ఇళ్ల ఎన్యుమరేషన్‌ నిర్వహిస్తున్న అధికారులు

కుక్కునూరు, ఆగస్టు 7 : గోదావరి వరదలకు ముంపునకు గురైన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించేందుకు ఇళ్ల పరిస్ధితిని అంచనా వేసేందుకు గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ విభాగం ఆదివారం ఎన్యూమరేషన్‌ ప్రారంభించారు. పదిరోజుల క్రితం గ్రామాలకు వెళ్లి నష్టం అంచనా వేశారు. అయితే జాబితాలో కొందరు ఇళ్లు రాలేదని ఆరోపణలు రావడంతో మళ్లీ దర ఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్‌ నిర్వహించారు. బెస్తగూడెం, గణపవరం, కుక్కునూరులతో పాటు పలు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఇళ్ల నష్టాన్ని అంచనా వేస్తూ జాబితాలో పేర్కొన్నారు. పాక్షికంగా, మధ్య స్తంగా, పూర్తిస్థాయిలో దెబ్బతిన్న ఇళ్లను గుర్తించనున్నారు. అందుకు అను గుణంగా ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించనున్నారు. అయితే డాబా ఇళ్ల వారికి కూడా నష్టం జరిగింది. ఇంట్లోని వస్తువులు కొట్టుకుపోవడంతో పాటు  స్విచ్‌ బోర్డులు, మీటర్లు దెబ్బతిని నష్టం జరిగింది. కానీ అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.


నేడు కుక్కునూరులో ముంపు పరిశీలన

కుక్కునూరు మండలంలో నేడు లైడార్‌ సర్వేను అనుసరించి 41.15 కాం టూర్‌ లెవల్‌ల్లో ఉన్న గ్రామాలను గుర్తించేందుకు అధికారుల బృందం పర్య టించనున్నట్టు సమాచారం. ప్రధానంగా గొమ్ము గూడెం, రామచంద్రపురంలతో పాటు పలు గ్రామాల్లో గుర్తించనున్నారు. లేడార్‌ సర్వే ప్రకారం ముంపు గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరి–1లో పూర్తిగా ముం పుగా ఉన్న గ్రామాలను, జలదిగ్బందంలో ఉన్న గ్రామాలను కేటగిరి–2లోను, 45 కాంటూర్‌లో ఉన్న గ్రామాలను కేటగిరి –3 గా విభజించినట్టు సమాచారం. 


Updated Date - 2022-08-08T06:52:23+05:30 IST