పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2021-07-24T04:39:03+05:30 IST

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
విత్తన బంతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న లీలాలక్ష్మారెడ్డి

  • కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ చైర్మన్‌ లీలాలక్ష్మారెడ్డి 

కడ్తాల్‌ : పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ చైర్మన్‌ కోర్పోలు లీలాలక్ష్మారెడ్డి అన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామంలో శుక్రవారం అటవీ శాఖ, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌, పర్యావరణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విత్తన బంతులు చల్లడం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీలా లక్ష్మారెడ్డి, ఆమనగల్లు, కందుకూరు ఎఫ్‌ఆర్వోలు కమాలోద్దీన్‌, నిఖిల్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో పది రకాల విత్తనాలతో కూడిన విత్తన బంతులను అన్మా్‌సపల్లి అటవీ ప్రాంతంలో చల్లారు. అనంతరం సర్పంచ్‌ పోతుగంటి శంకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లీలాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కౌన్సిల్‌ ఆధ్వర్యంలో గత పదేళ్ల కాలంగా వివిధ ప్రాంతాల్లో 34 లక్షల మొక్కలను నాటించడం జరిగిందని, గత నాలుగేళ్లుగా వివిధ రకాల విత్తనాలను సేకరించి సంస్థ ద్వారా 16 లక్షల విత్తన బంతులను తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో చల్లడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది హేమ, దేవేందర్‌, లలిత, విజయభాస్కర్‌రెడ్డి, కలకొండ సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, సీజీఆర్‌ ప్రతినిధులు కొప్పు కృష్ణ, డాక్టర్‌ సాయిభాస్కర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త వెంకటేశ్‌, నాయకులు రామకృష్ణ, కుమార్‌గౌడ్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T04:39:03+05:30 IST