పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2022-06-25T06:45:23+05:30 IST

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి అన్నారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
మొక్క నాటుతున్న మునిసిపల్‌ కమిషనర్‌

రామగిరి, జూన 24:  పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ కేవీ రమణాచారి అన్నారు. వా ర్డు వాచ కార్యక్రమంలో భాగంగా శు క్రవారం ఆయన 5వ వార్డులో ఆ వా ర్డు కౌన్సిలర్‌ పున్న గణే్‌షతో కలిసి ప ర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాలపై నిర్మాణాల ను తొలగించాలని టౌనప్లాన సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు. వార్డును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఓపెన నా లాల్లో ఎప్పటికప్పుడు పూడికను తీయించాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. పట్టణాన్ని హరిత నల్లగొండగా మార్చేందుకు ఓపెన స్థలాల్లో మొక్కలను పెంచాలని సూచించారు.  ప్రతీ ఆదివారం మన నగరం మన పట్టణం మన నల్లగొండ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక గంట పాటు శ్రమదానం చేసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా మునిసిపల్‌ కార్మికులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈలు వెంకన్న, అశోక్‌, ఏసీపీ నాగిరెడ్డి, ఏఈలు రవీందర్‌, దీపక్‌, టీపీబీవో శివ, శానిటరీ ఇనస్పెక్టర్లు ప్రదీ్‌పరెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఏఈ నాగదుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-25T06:45:23+05:30 IST