యుగపురుషుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-05-29T05:21:25+05:30 IST

ప్రజలే దేవుళ్లు..సమాజమే దేవాలయం అని చాటిచెప్పిన యుగపురుషుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నంద మూరి తారక రామారావు అని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

యుగపురుషుడు ఎన్టీఆర్‌
మదనపల్లెలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన్‌, మే 28: ప్రజలే దేవుళ్లు..సమాజమే దేవాలయం అని చాటిచెప్పిన యుగపురుషుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నంద మూరి తారక రామారావు అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. శనివారం మదనపల్లె పట్టణంలో పలుచోట్ల టీడీపీ పట్టణ అధ్యక్షుడు భవాని ప్రసాద్‌, టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనం గా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి నివాళులర్పించారు. భవానిప్రసాద్‌, ఎస్‌ఏ మస్తాన్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను అన్ని రంగా ల్లో అభివృద్ధికి దోహదపడ్డారన్నారు. అనంతరం ఎన్టీఆర్‌సర్కిల్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు. బర్మావీధి, నిమ్మనపల్లె సర్కిల్‌, చిత్తూరు బస్టాండులో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నేత రాటకొండ బాబురెడ్డి, నాయకులు మోడెం సిద్దప్ప, దొర స్వామినాయుడు, సోమశేఖర్‌, పులి మోహన్‌, ఎం.నాగయ్య, సుధాకర్‌, ఎస్‌ఎల్‌వీ రఘు, అఖిల్‌, చెక్కా రామ్మోహన్‌, టీడీపీ ఫోరం కన్వీనర్‌ నవీన్‌, రాజేష్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను బి.కొత్తకోటలో ఘనంగా నిర్వహించా రు. ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ నాయకులు స్థానిక జ్యోతి బస్టాం డులో ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ జయంతిని పురష్కరించుకుని కేక్‌ కట్‌ చేసి అందరి కి పంచి పెట్టారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నాయకులు మా ట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత  ఎన్టీఆర్‌దేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ బి.కొత్తకోట టౌన్‌ ప్రెసిడెంట్‌ బంగారు వెంకట్రమణ, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సుకుమార్‌, తంబళ్ల పల్లె ఎస్సీ సెల్‌ అద్యక్షుడు సురేంద్రబాబు, మండల ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్‌, టీడీపీ నాయకులు దేవుడు నాగరాజ, ఆంజనేయులు, షమివుల్లా, కనకంటి ప్రసాద్‌ , రంజిత్‌ కుమార్‌, రమణ పాల్గొన్నారు. 

గుర్రంకొండలో:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడులకలను ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఇందులో భాగంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఏజాజ్‌ అహ్మద్‌, ఇక్బాల్‌ ఖాసీం, గోవింద్‌, సుబ్బన్న, రమణ, షఫీ, మౌలా, బాబాజాన్‌, ముజమిల్‌, తన్వీర్‌, జమీర్‌, భాస్కర్‌, రెడ్డిశేఖర్‌, తౌరేనాయక్‌, రంజిత్‌, శ్రీనివాసులు, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-29T05:21:25+05:30 IST