సమాన పనికి సమాన వేతనమివ్వాలి

ABN , First Publish Date - 2022-01-24T06:12:08+05:30 IST

సమాన పనికి సమాన వేతనమివ్వాలని గవర్నమెంట్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

సమాన పనికి సమాన వేతనమివ్వాలి
సదస్సులో ప్రసంగిస్తున్న నాగేశ్వరరావు

గవర్నమెంట్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ 


తిరుపతి(కల్చరల్‌), జనవరి 23: సమాన పనికి సమాన వేతనమివ్వాలని గవర్నమెంట్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తిరుపతి యశోదనగర్‌లోని ఎంబీ భవన్‌లో జేఏసీ జిల్లా చైర్మన్‌ గండికోట నాగవెంకటేశ్‌  అధ్యక్షతన ఆదివారం జరిగిన ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సమాన వేతనంతోపాటు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. ఇదే అంశంపై ఈనెల 31న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో  కార్మికులు  పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణమూర్తి, లోకే్‌షబాబు, ఈశ్వర్‌కుమార్‌,  నారాయణ, గుణశేఖర్‌,  గండికోట చినబాబు,  డాక్టర్‌ రవి, సురేంద్రనాయుడు,  ఓబయ్య, మనోహర్‌,  బాలకృష్ణ, రవికుమార్‌,  ప్రసాద్‌, సుబ్రహ్మణ్యం, ఆర్‌.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-24T06:12:08+05:30 IST