అవగాహనతో కరోనాను తరిమికొడదాం

ABN , First Publish Date - 2022-01-25T03:55:09+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అవగాహనతో కలసి కట్టుగా తరిమికొడదామని ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అవగాహనతో కరోనాను తరిమికొడదాం
వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న నేదురుమల్లి

 నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి 

కోట, జనవరి 24 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అవగాహనతో కలసి కట్టుగా తరిమికొడదామని ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యానగర్‌లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్‌లో సోమవారం ఎన్‌బీకేఆర్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌  శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 950 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.  కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ విజయకుమార్‌రెడ్డి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గాది శ్రీనివాస్‌, హరికృష్ణ, కోఆర్డినేటర్‌ రాజేష్‌, ఎన్‌సిసి ఆఫీసర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-25T03:55:09+05:30 IST