డబ్బు కోసమే బోల్డ్‌ కంటెంట్‌తో వెబ్‌సిరీస్‌లు: ఎరికా ఫెర్నాండెజ్

Jun 9 2021 @ 16:20PM

దర్శకుడు శశి దర్శకత్వం వహించిన ‘ఐందు ఐందు ఐందు’ అనే చిత్రంలో హీరో భరత్‌ సరసన నటించిన ఎరికా ఫెర్నాండెజ్‌ ఆ చిత్రం తర్వాత ‘విరట్టు’, ‘విళిత్తిరు’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు ఏవీ ఆమెను ఆదుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ పలు చిత్రాల్లో నటిస్తూ అంత్యంత బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ‘కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ’ సీరియల్‌ రెండో భాగంలో డాక్టర్‌ సోనాక్షి పాత్రలో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సీరియల్‌ మూడో భాగంలోనూ నటిస్తోంది. అలాగే, మరో హిందీ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. వీటితో పాటు పలు వెబ్‌సిరీస్‌లలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. దీనికి కారణం.. ఆ సిరీస్‌లలో బోల్డ్‌ కంటెంట్‌ అధికంగా వుండటంతో వాటి ఆఫర్‌ను తిరస్కరించింది. 


ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ.. ‘‘వెబ్‌సిరీస్‌ల కోసం సరైన కథలు లేకపోవడంతో కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా బోల్డ్‌ కంటెంట్‌లు ఉద్దేశపూర్వకంగా చొప్పిస్తున్నారు. పైగా కథతో సంబంధం లేకుండా, అకారణంగా బోల్డ్‌గా నటించాలని కోరుతున్నారు. అలాంటి సన్నివేశాలు ఈ సిరీస్‌కు అవసరమా అని ఎదురు ప్రశ్నిస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. బోల్డ్‌ కంటెంట్‌ అనే పేరుతో అనవసరమైన, అసభ్యకరమైన సీన్లను చిత్రీకరించి, వాటిని వ్యాపారకోణంలో ప్రసారం చేయడం ఎంతవరకు సబబు? కథలో ప్రాధాన్యత ఉన్నట్టయితే అలాంటి పాత్రల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, కేవలం డబ్బు సంపాదన కోసమే అశ్లీల సన్నివేశాలను షూట్‌ చేసి వాటిని వెబ్‌సిరీస్‌ల పేరుతో ప్రసారం చేయడం ఎంతవరకు న్యాయం? అందుకే అలాంటి పాత్రల్లో నటించేందుకు నిరాకరిస్తున్నాను. పైగా టీవీ సీరియల్స్‌లో నటించడం నాకు ఎంతో సౌకర్యవంతంగా, రక్షణగా కూడా వుంది’’ అని పేర్కొంది. కాగా, ఎరికా ఫెర్నాండెజ్ టాలీవుడ్‌లో ‘గాలిపటం’, ‘డేగ’ వంటి చిత్రాలలో నటించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.